ఏప్రిల్ 29న మాచర్ల నియోజక వర్గం చూపిస్తానని నితిన్ ఇదివరకే చెప్పేసాడు. అయితే ఇప్పుడు సేమ్ డేట్ ఎఫ్3 రిలీజ్ చేస్తామని దిల్ రాజు అనౌన్స్ చేసాడు. మరి ఈ రెండు సినిమాలకు ఏప్రిల్ లో మోక్షం ఉంటుందో లేదో తెలియదు..ఇక ఇవే కాదు... బాలీవుడ్ నుంచి కంగనా రనౌత్ ధక్కడ్, మాధవన్ రాకేట్రి, టైగర్ ష్రాఫ్ హీరోపంటి2, అమితాబ్ - అజయ్ దేవగణ్ రన్ వే 34 సినిమాలు ఏప్రిల్ గేమ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఏప్రిల్ రిలీజ్ బరిలో గెలిచేవెన్ని.. ఫూల్స్ అయ్యేవెనో చూడాలి మరి.