కానీ వీరిద్దరి డివోర్స్ గురించి మీడియాలో అనేక కథలు వెలువడ్డాయి. ఇప్పుడిప్పుడే ఇటు నాగ చైతన్య, అటు సమంత తమ వర్క్ పై ఫోకస్ పెట్టారు.సమంత వరుసగా కొత్త చిత్రాలకు సైన్ చేస్తోంది. ఇక చైతు తాను కమిటై ఉన్న చిత్రాలని ఫినిష్ చేస్తున్నాడు. గత ఏడాది చైతు లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. అదే జోష్ తో తన తండ్రి నాగార్జునతో కలసి బంగార్రాజు చిత్రంతో సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.