పెళ్లైన హీరోలతో ఎఫైర్లు నడిపిన స్టార్ హీరోయిన్లు...గాసిప్స్ లో చిక్కుకున్న బడా స్టార్స్ ఎవరో తెలుసా..?

First Published | Jul 4, 2024, 5:08 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎఫైర్లు, లవ్ ట్రాక్ లు, రూమర్లు, గాసిప్ లు.. కామన్. కొన్ని నిజాలు కొన్ని అబద్దాల నడుమ..మాయా ప్రపంచంలా మారిపోయింది సినిమా ఇండస్ట్రీ. ఇక ఇందులో పెళ్ళైన స్టార్ హీరోలతో ఎఫైర్లు పెట్టుకున్న హీరోయిన్లు.. ఎఫైర్లు పెట్టుకున్నట్టుగా గాసిప్స్ క్రియేట్ అయిన తారల గురించి ఇప్పుడు చూద్దాం. 

సినిమా పరిశ్రమ అంటేనే.. రకరకాల వివాదాలు, విజయలు, ఫెయిల్యూర్లు, లవ్ స్టోరీలు, ఇలా రకరకాల యాంగిల్స్ ఉంటాయి. అందులో ఎఫైర్స్  గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ల మధ్య రకరకాల ఎఫైర్స్ వార్తలు వింటూనే ఉంటాం. అందులో కొన్నినిజం ఉంటే.. మరికొన్ని రూమర్స్ ఉంటాయి. మరికొన్ని నిజాలు ఉన్నా సాక్ష్యాలు ఉండవు. ఈక్రమంలో పెళ్ళైన హీరోలతో ఎఫైర్లు నడిపిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని గాసిప్స్ కూడా ఉన్నాయి మరి. 

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?
 

టాలీవుడ్ లో అక్కినేనివారసుడిగా స్టార్ డమ్ సంపాదించాడు నాగచైతన్య. కాని హీరోగా సాలిడ్ సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలోనే తండేల్ మూవీతో రాబోతున్నాడు. ఈక్రమంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్ళాడాడు. అయితే ఆయన విడాకుల తరువాత హీరోయిన్ శోభితాతో రిలేషన్ లో ఉన్నాడని మీడియా కోడై కూసింది. వీరిద్దరు  ఫారెన్ ట్రిప్పులు వేసినట్టు సాక్ష్యాలు కూడా బయటకు వచ్చాయి. కాని అఫిషియల్ గా మాత్రం వీరు ఓపెన్ అవ్వలేదు. 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..


ఇక నాగచైతన్య తండ్రి.. టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకన్న నటుడు నాగార్జున తో కూడా హీరోయిన్ టబుకు ఇలా ఎఫైర్ నడిచింది అని టాక్. మొదట వెంకటేష్ చెల్లెల్ని పెళ్లాడి.. నాగచైతన్య పుట్టిన  తరువాత విడాకులు ఇచ్చిన నాగ్.. ఆతరువాత నటి అమలను పెళ్ళాడి అఖిల్ కు జన్మనిచ్చారు. అయితే నాగార్జునకు హీరోయిన్ టబుతో ఎఫైర్ ఉందంటూ ఇండస్ట్రీ మొత్తుకుంది. కాని నాగార్జున మాత్రం అవన్నీ పట్టించుకోము.. మామధ్య మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అన్నారు. కాని నాగార్జున కోసమే  నటి టబు పెళ్లి చేసుకోలేదని.. పెళ్ళి దాకా వచ్చి వీరి బంధం బ్రేకప్ అయ్యిందంటుంటారు.  దాదాపు పదేళ్లుగా వీరిద్దరూ రహస్య బంధంలో ఉన్నారని రూమర్ గట్టిగాచక్కర్లు కొడుతుంది. 

భార్య ముందే బాలకృష్ణకు ముద్దు పెట్టి, ఐ లవ్ యు చెప్పిన స్టార్ హీరోయిన్..? తరువాత ఏమయ్యిందో తెలుసా..?

ఇక ఈ లిస్ట్ లోనే ఉన్నారు నాయనతార‌-ప్రభుదేవా. నయనతార గతంలో పెళ్లైన ప్రభుదేవాతో రిలేషన్ మెయింటేన్ చేసింది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. కాని ప్రభుదేవ మొదటి భార్య అడ్డుకోవడంతో.. వీరి బంధం వివాదంగా మారింది. ఆతరువాత ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చినా.. నయనతారతో బంధం నిలబెట్టుకోలేకపోయాడు. అప్పటి వరకూ రహస్యంగా నడిచిన వీరి వ్యవహరం రోడ్డుకెక్కింది. ఇక ఆతరువాత నయన్ విఘ్నేష్ శివన్ పెళ్ళాడి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 
 

తమిళ స్టార్ హీరో ధనుష్  పరిస్థితి కూడా ఇదే. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ నుపెళ్లాడాడు ధనుష్. 18 ఏళ్లు కాపురం చేసిన తరువాత రీసెంట్ గా వీరు విడిపోయారు. దీనికి కారణం హీరోయిన్ అమలా పాల్ తో ధనుష్ కు ఎఫైర్ ఉందని.. ఈ విషయంలోనే వీరి మధ్య గొడవలు జరిగాయని తమిళనాట గట్టిగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కాని.. ధనుష్ నుంచి అతని భార్య మాత్రం విడాకులకు వెళ్లింది. 
 

అంతే కాదు అతిలోక సుందరి.. దివంగత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూడా  నిర్మాత బోనీ కపూర్ తో ఇలాంటి బంధాన్ని కలిగి ఉందట.  అతని మొదటి భార్య కు విడాకులు ఇవ్వకమునుపే శ్రీదేవి బోనీకపూర్లు రహస్యంగా కాపురం పెట్టారు. ఈ కారణంగానే నటి శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందని పుకార్లు వచ్చాయి. మోనా కపూర్ తో పెళ్ళి తరువాత 13 ఏళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్లాడాడు బోనీ కపూర్.  వీరిద్దరి విడిపోవడానికి నటి శ్రీదేవి కారణమని విమర్శలు చాలా వచ్చాయి. 

గ్లోబల్ హీరో కమల్ హాసన్ కూడా పలు ప్రేమ వివాదాల్లో చిక్కుకున్నాడు. కమల్ మొదట వాణి గణపతిని మరియు రెండవది సరితను వివాహం చేసుకున్నారు, రెండూ విడాకులతో ముగిశాయి. ఆ తర్వాత అతను హీరోయిన్ గౌతమీతో అఫీషియల్ గానే సహజీవనం చేశారు. ఈమధ్యలో కమల్ హాసన్ తో  నటి సిమ్రాన్‌ ప్రేమలో ఉన్నారని  వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు కమల్..  నా బెడ్‌రూమ్‌లో.. ఏం జరుగుతుందో తెలుసుకోవడమే మీకు పనిగామారింది అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు

ఇంకా ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా జరిగాయి. రెండు సార్లు పెళ్లైన నటుడు నరేష్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ సహజీవనం చేయడం. సూపర్ స్టార్ కృష్ణ తన మరదలిని పెళ్ళాడి.. మహేష్ బాబుతో సహా.. ఐదుగురు పిల్లలు పుట్టాక.. విజయ నిర్మలతో సహజీవనం చేయడం.. ఇలా గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఇండస్ట్రీలో ఇవి ఇప్పుడు కామన్ గా మారాయి. 
 

Latest Videos

click me!