ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళిపోతానన్న చైతు.. ఆమె కంటే ముందుగా మరో హీరోయిన్ తో ఎఫైర్..నాగార్జున ఏం చేశారంటే

Published : Jul 04, 2024, 05:01 PM ISTUpdated : Jul 04, 2024, 06:19 PM IST

చైతు హీరో అయినప్పటి నుంచి గమనిస్తున్నా.. వాడికి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది. 100 శాతం నాకు తెలుసు. కానీ ఆమె ఎవరనేది తెలియదు.

PREV
16
ఇంట్లో నుంచి ఒంటరిగా వెళ్ళిపోతానన్న చైతు.. ఆమె కంటే ముందుగా మరో హీరోయిన్ తో ఎఫైర్..నాగార్జున ఏం చేశారంటే
Nagarjuna Akkineni

ఏఎన్నార్ తర్వాత తండ్రి వారసత్వాన్ని కింగ్ నాగార్జున దిగ్విజయంగా కొనసాగించారు. నాగార్జున తర్వాత ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టారు. నాగ చైతన్య తన స్టైల్ లో సినిమాలు చేస్తున్నాడు. అఖిల్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నాడు. దాదాపు పదిహేనేళ్ల క్రితమే నాగ చైతన్య ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

26

మొదటి చిత్రం జోష్ నిరాశపరిచింది. ఆ తర్వాత ఏమాయ చేశావే చిత్రంతో చైతు ఫస్ట్ హిట్ అందుకున్నాడు. తన కొడుకులు ఇద్దరినీ నాగార్జున గమనిస్తూనే ఉంటారట. కావాల్సిన ఫ్రీడమ్ ఇస్తారు కానీ.. తండ్రిగా వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉంటారట. చైతు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బిగినింగ్ లో నాగార్జున కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

36

చైతు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఫస్ట్ మూవీ అనుకున్నంతగా రాణించలేదు. నేను చాలా టెన్షన్ పడ్డాను. వాడే నాతో ఏం కాదులే నాన్న ఇంకో సినిమా చూద్దాం అని ధైర్యం చెప్పినట్లు నాగార్జున తెలిపారు. చైతు గురించి ఏదైనా సీక్రెట్ చెబుతారా అని యాంకర్ ప్రశ్నించగా నాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

46
Nagarjuna Akkineni

చైతు హీరో అయినప్పటి నుంచి గమనిస్తున్నా.. వాడికి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది. 100 శాతం నాకు తెలుసు. కానీ ఆమె ఎవరనేది తెలియదు. వాచ్ మెన్ లకు కూడా సీక్రెట్ గా చెప్పా. ఎవరితో వస్తున్నాడో గమనించండి అని. కానీ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. 

56

అంతే కాదు.. మరో ఆరు నెలల్లో నేను బయట ఒంటరిగా ఉంటా నాన్న అని అడిగాడు. సొంతంగా వేరే ఇంట్లో ఉంటాను అని చెబుతున్నాడు. ఎందుకు అని అడిగితే ఏం లేదు అని మాట దాటేస్తున్నట్లు నాగార్జున తెలిపారు. దొరికి ఉంటె మాత్రం వార్నింగ్ ఇచ్చేవాడిని అన్నట్లుగా నాగ్ ఫన్నీగా చెప్పారు. 

66

గర్ల్ ఫ్రెండ్ లేకుంటే బయట ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏముంది.. అక్కడే తెలిసిపోతోంది కదా అని నాగ్ అన్నారు. అయితే కెరీర్ బిగినింగ్ లో చైతు ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాడు అనేది మాత్రం ఇప్పటికీ సీక్రెట్. కొన్నేళ్ల తర్వాత చైతు సమంత ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories