మళయాళి చిత్రం 'వర్షంగళ్కు శేషం' ఓటిటి రివ్యూ

First Published | Jul 4, 2024, 4:49 PM IST

ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళ డ్రామా చిత్రం (Varshangalkku Shesham) ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

Varshangalkku Shesham


ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరు మళయాళ చిత్ర పరిశ్రమ. అందులోనూ చిన్న సినిమా అంటే వాళ్లు చాలా భావుకతతో చెక్కుతుంటారు. భారీ బడ్జెట్ లు ఉండవు కాబట్టి స్క్రిప్టుని నమ్మి చేసే సినిమాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా స్టార్స్ లేని సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. అక్కడ హిట్టైన సినిమాలు మనకు తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటిటిలోకి  వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలో రీసెంట్ గా ఓటిటిలో వచ్చిన చిత్రం    'వర్షంగళ్కు శేషం' . ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. తెలుగులోనూ బాగానే వెళ్తోంది. ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత..సినిమా కథేంటి వంటి విషయాలు చూద్దాం.


కథ

1970-90 మధ్యకాలంలో జరిగే ఈ కథ ఇద్దరు స్నేహితులు మురళి(ప్రణవ్ మోహన్ లాల్) , వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) చుట్టూ తిరుగుతుంది. వేణుకు థియేటర్ అంటే ఇష్టం. ఆ లైన్ లో ఏదైనా చెయ్యాలనుకుంటాడు. మురళి ఏమో ఇండిపెండెంట్ గా సంగీతకారుడు అవుదామనుకుంటాడు. అయితే ఇద్దరూ వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నవాళ్లు. అయినా ఒకరిని ఒకరు విడిచిపెట్టలేనంత స్నేహంగా ఉంటారు. ఇద్దరూ కలిసి ఓ టైమ్ లో మద్రాస్ సినిమా పరిశ్రమలో వెలుగుదామని వస్తారు. 
 


varshangalkku shesham movie


అయితే సినిమా పరిశ్రమ విచిత్రమైనది. ఎవరెవరినో పైకి లేపుతుంది. మరికొందరని నిర్ధాక్ష్యణంగా తొక్కేస్తుంది. అలాగే కొత్త స్నేహాలు చిగురిస్తాయి. పాత స్నేహాలకు మంగళం పాడించేస్తుంది. అదే క్రమంలో వేణుకి మురళికు ప్రొడ్యూసర్ ని ఇచ్చి కెరీర్ ని ప్రసాదిస్తాడు. అందుకోసం తను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ట్యూన్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆ ట్యూన్ తోనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. అయితే వేణుకు ఈ విషయం ఏమీ తెలియదు. 
 

Director Vineeth Sreenivasan Varshangalkku Shesham

తనను చూసి మురళి  అసూయ పడుతున్నాడేమో, దిగజారిపోయాడు..తాగుబోతు అయ్యిపోయాడు అని దూరం అవుతాడు. నలభై ఏళ్ల జర్నీలో మురళి తన ప్రేయసిని, కెరీర్ ని అన్నీ పోగొట్టుకుంటాడు. వేణు అన్ని సాధిస్తాడు. చివరకు విడిపోయిన తమ స్నేహాన్ని నిలెబట్టుకుందామనుకుంటాడు. ఇద్దరు కలిసి ఓ సినిమా చేద్దామనుకుంటారు. ఆ క్రమంలో ఎన్నో అవాంతరాలు. వాటిని లేటు వయస్సులో వీళ్లద్దరూ ఎలా దాటారు. చివరకు వీళ్లద్దరు తీసిన సినిమా ఆడిందా..ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే...

ఈ సినిమా స్క్రిప్టు వినీత్ శ్రీనివాసన్ రాసి డైరక్ట్ చేసారు. అయితే ఒకే కథలో ఎన్నో విషయాలు చెప్పేయాలనుకున్నాడు. కేవలం ఇద్దరి స్నేహితుల కథగా దీన్ని ప్రెజెంట్ చేద్దామనుకులేదు. ఇద్దరి జీవితాలు చెప్పేయాలనుకోవటంతో కొన్ని సార్లు సాగతీసినట్లు, రిపీట్ అయ్యినట్లు, సినిమా లెంగ్త్ పెరగటం వంటివి జరిగిపోయాయి. అలాగే వేణు, మురళి మధ్య మొదట గొడవకు స్ట్రాంగ్ రీజన్ కనపడదు. కథలో అక్కడ ఇద్దరు విడిపోవాలి కాబట్టి విడిపోయారనిపిస్తుంది. అయితే ఈ సినిమాని కొద్దిగా ఫన్ మోడ్ లో నడపటం, నోస్ట్రాలజీ ఫీల్ తీసుకురావటం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సెకండాఫ్ లో హ్యామర్ కు ప్రయారటి ఇవ్వటం కలిసి వచ్చింది. అలాగే నివిన్ పౌలీని పెట్టి ఇండస్ట్రీలోని హీరోలపై స్పూఫ్ చేయటం బాగా పేలింది. ఓవరాల్ గా ఓ ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ప్రెడ్షిప్  ప్రధానాంశంగా తీసుకుని భావోద్వేగాలతో కథను నడిపారు. అయితే అసలు  కథలోకి వెళ్లటానికి చాలా టైమ్ తీసుకున్నారు. స్లో నేరేషన్ మొదట్లో ఇబ్బంది పెడుతుంది. అయితే సినిమాలో ఎప్పుడైతే డ్రామా,కాంప్లిక్ట్స్ మొదలయ్యాయో అక్కడ నుంచి పరుగెడుతుంది. 
 

varshangalkku shesham


 టెక్నికల్ గా చూస్తే... 

విశ్వజిత్ కెమెరా వర్క్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సినిమాకు అది ప్రత్యేక నిండుతనం తెచ్చింది. రంజన్ అబ్రహం ఎడిటింగ్ విషయానికి వస్తే పేస్ నీట్ గా నడిపారు కానీ, మూడు గంటల డ్యూరేషన్ అనేది ఇబ్బందిగా మారింది. సినిమా ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగా చేసారు. అమృత్ రామనాథ్ మ్యూజిక్ ..ఓ చక్కటి అందమైన ఆల్బమ్ ని చూసిన ఫీల్ తెచ్చింది. సినిమా మొదటి నుంచి చివరిదాకా వినిపించే Nyabagam ట్రాక్ మనని కట్టి పారేస్తుంది. 
  

varshangalkku shesham movie


ఆర్టిస్ట్ లు విషయానికి వస్తే.. 

ఈ సినిమా ప్రత్యేకత మ‌ల‌యాళ పరిశ్రమలోని స్టార్స్ పిల్లలు ప్రధాన పాత్రల్లో కనిపించటం. మళయాళ  స్టార్ మోహ‌న్‌లాల్  కొడుకు ప్ర‌ణ‌వ్ మోహన్ లాల్ (Pranav Mohanlal) ఒక హీరోగా, మరో మళయాళి నటుడు దర్శకుడు శ్రీనివాసన్ పెద్ద కొడుకు వినీత్ శ్రీనివాసన్ డైరక్టర్ గానూ, ఆయన చిన్న కొడుకు ధ్యాన్ శ్రీనివాసన్ మరో హీరోగానూ చేసారు. అలాగే ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శని మరో కీలకమైన పాత్రలో చేసింది. ఈ సినిమా మళయాళంలో ఈ సంవత్సరం టాప్ గ్రాసర్ లలో ఒకటిగా నిలవటమే కాకుండా 80 కోట్లు దాకా వసూలు చేసి కొత్త రికార్డ్ లు క్రియేట్ చేసింది.  
 
 


 
చూడచ్చా

సినిమా ఫీల్ గుడ్ మూవీ. సినిమా నేపధ్యంలో వచ్చే సినిమాలపై ఆసక్తి ఉంటే ఖచ్చితంగా చూడదగ్గదే. అలాగే సినిమా నీట్ గా ఫ్యామిలీలతో చూడదగేలా ఉంది. 

 
ఏ ఓటిటిలో ఉంది

సోనీ లివ్ ఓటిటిలో తెలుగులో ఉంది. 
 

Latest Videos

click me!