ram charan, rc16, buchibabu
RC16 Glimpse: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `ఆర్‌సీ16` అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీ నుంచి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు.
ram charan
రేపు గురువారం(మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. `ఆర్‌సీ16` నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ గ్లింప్స్ రెడీ చేసి పెట్టారట.
ప్రస్తుతం విడుదల చేయాలా? వద్దా అనే డైలామాలో ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు, రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.
ram charan, rc16, buchibabu
లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు గ్లింప్స్ ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చారట. రామ్ చరణ్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇవ్వకపోతే వాళ్లంతా హర్ట్ అవుతారు.
చాలా డిజప్పాయింట్ అవుతారు. వాళ్లని ఖుషీ చేయాలంటే గ్లింప్స్ ఇవ్వాల్సిందే. అందుకే సడెన్ సర్‌ప్రైజ్‌గా ఈ గ్లింప్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. పవర్‌ఫుల్ గ్లింప్స్ రెడీగా ఉందని, దీనికి రెహ్మాన్ కూడా అదిరిపోయే ట్రాక్ రెడీ చేశారని తెలుస్తుంది.
ram charan, ar rahman
అంతేకాదు గ్లింప్స్ తోపాటు సినిమా టైటిల్‌ని కూడా ప్రకటించే అవకాశం ఉందట. `పెద్ది` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారట. మరి ఈ టైటిల్ గ్లింప్స్ ఇస్తారా? లేక సీన్ గ్లింప్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఏది ఇచ్చినా అదిరిపోతుందని అంటున్నారు టీమ్. గ్లింప్స్ ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుందని చెబుతున్నారు.
బుచ్చిబాబు మతిపోయేలా ఈ ట్రీట్ రెడీ చేసి పెట్టాడట. విడుదల కావడమే ఆలస్యం. ఫ్యాన్స్ కి పూనకాలు తప్పవు అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. దీన్ని చరణ్ బర్త్ డే సందర్బంగా రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రోజు బుధవారం అప్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.