‘విశ్వంభర’ కి OTT తలనొప్పి? అంత తక్కువకి అడుతున్నారా
చిరంజీవి 'విశ్వంభర' సినిమా OTT హక్కుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మాతలకు, OTT సంస్థలకు మధ్య ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణం.
చిరంజీవి 'విశ్వంభర' సినిమా OTT హక్కుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. నిర్మాతలకు, OTT సంస్థలకు మధ్య ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణం.
సాధారణంగా, పెద్ద స్టార్లు నటించిన సినిమాలు ప్రొడక్షన్ పూర్తి కాకముందే స్ట్రీమింగ్ , శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌లకు అమ్ముడవుతాయి.
అయితే చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ కి మాత్రం ఓటిటి బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదనే వార్తలు మీడియాలో మరోసారి గుప్పుమంటున్నారు.
OTT, శాటిలైట్ ఎగ్రిమెంట్స్ ముందుగానే లాక్ చేసే చిరంజీవి యొక్క మునుపటి చిత్రాల మాదిరిగా కాకుండా, విశ్వంభర బిజినెస్ పరిస్దితి డిఫరెంట్ గా ఉందంటోంది ట్రేడ్. అలా ఎందుకు జరుగుతోంది. ఎక్కడుంది లోపం
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓటీటీ సంస్థలు చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
నిర్మాతకూ, ఓటీటీలకూ సరైన డీల్ కుదర్లేదంటున్నారు. నిర్మాత చెప్తున్న రేటుకు, ఓటిటిలు అడుగుతున్న రేటుకు అసలు పొంతన లేదని, దగ్గరలోకి కూడా రాలేదని, నెగోషియేషన్స్ వివరీతంగా ఉండటంతో విశ్వంభర పెండింగ్ లో ఉందని చెప్తున్నారు.
ఇక యూవీ నిర్మాతలేమో ఈ సినిమా ఓటీటీ డీల్ రూ.75 కోట్లు అడుగుతున్నట్లు చెప్పుకుటున్నారు. ఓటీటీ సంస్థలు నలభై వరకూ రావడం లేదని తెలుస్తోంది. దానికి కారణం టీజర్ బజ్ క్రియేట్ చేయకపోవటమే అని తెలుస్తోంది.
ట్రైలర్ రిలీజ్ అయ్యాక మళ్లీ విశ్వంభర ఓటీటీ బేరాలు మొదలయ్యే అవకాసం ఉంది. ఆ ట్రైలర్ లో విజువల్స్ బాగుంటాయట. చిరంజీవి దగ్గరుండి ప్రత్యేకంగా ట్రైలర్ ని ముగ్గురు కు ఇచ్చి వాటిలో ఒకటి ఎంపిక చేసారని టాక్.
ఈ ట్రైలర్ వచ్చాక… ఓటీటీ సంస్థలు రేటు పెంచుతాయని, అప్పుడు కనీసం రూ.70 కోట్లకు ఈ డీల్ సెట్ చేయొచ్చని యూవీ భావిస్తోంది. హిందీ రైట్స్ రూ.38 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ఇది కూడా మంచి బిజినెస్సే. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.