శృతి హాసన్ - శాంతను రొమాంటిక్ పిక్.. వాలెంటైన్స్ డేన ప్రియుడిని పొగిడేసిన స్టార్ హీరోయిన్

First Published | Feb 14, 2023, 1:50 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్  - శాంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈప్రత్యేకమైన రోజున ఓ బ్యూటీఫుల్ అండ్ రొమాంటిక్ ఫొటోను షేర్ చేస్తూ తన ప్రియుడికి వాలెంటైన్స్ డే విషెస్ తెలిపారు స్టార్ హీరోయిన్. 
 

టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్‌ (Shruti Haasan) తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతిరిగా  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు. 
 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్, నార్త్ ఆడియెన్స్ లో  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన స్కిల్, టాలెంట్ తో స్టార్ హీరో కూతురి స్టేజీ నుంచి స్టార్ హీరోయిన్ గా మారారు. హీరోయిన్ గా తనను తాను ఫ్రూవ్ చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 


శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈక్రమంలో తన భాయ్ ఫ్రెండ్ ను కూడా రెండేండ్ల కిందనే పరిచయం చేసిన విషయం తెలిసిందే. 
 

ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికా (Shantanu Hazarika)తో శృతి హాసన్ ప్రేమలో మునిగితేలుతోంది. ఈ సందర్భంగా బాయ్ ఫ్రెండ్ తో టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తున్నారు. ప్రత్యేకమైన రోజులు, ఈవెంట్స్ కూ కలిసి హాజరవుతూ ఆకట్టుకుంటున్నారు. 

ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో తన ప్రియుడితో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం ‘3’ సినిమా పోస్టర్ ను గుర్తు చేసేలా ఉండటం విశేషం. శాంతను - శృతి ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ఆకట్టుకున్నారు. ఈ ఫొటోను షేర్ చేసుకుంటూ శాంతనుకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.
 

శృతి హాసన్ ఈ పోస్ట్ షేర్ చేసుకుంటూ.. తన బాయ్ ఫ్రెండ్ పట్ల ప్రేమను వ్యక్తం చేసింది. ఈసందర్భంగా ఇలా రాసుకొచ్చారు. ‘నువ్వు నా బెస్ట్.. నువ్వు  ఎప్పుడూ నా మదిలోనే ఉంటావు. నువ్వే నా వెలుగు, నువ్వే నా చీకటి. ఈవిషయంలో నేనే చాలా అదృష్టవంతురాలిని’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ ‘సలార్’లో నటిస్తున్నారు.  రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. 
 

Latest Videos

click me!