అనుష్క వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్‌.. నవ్వితే షూటింగ్‌ బంద్‌.. విచిత్రమైన పరిస్థితిలో స్వీటి..

Published : Feb 14, 2023, 01:31 PM ISTUpdated : Feb 14, 2023, 01:52 PM IST

టాలీవుడ్‌ స్వీటి అనుష్క శెట్టి సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నెమ్మదిగా యాక్టివ్‌ అవుతుంది. తాజాగా ఆమె వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 

PREV
15
అనుష్క వాలెంటైన్స్ డే పోస్ట్ వైరల్‌.. నవ్వితే షూటింగ్‌ బంద్‌.. విచిత్రమైన పరిస్థితిలో స్వీటి..

అనుష్క శెట్టి బాహుబలి వరకు టాలీవుడ్‌ని ఊపేసింది. `భాగమతి` తర్వాత జోరు తగ్గించింది. బరువుకి సంబంధించిన సమస్యలతో బాధపడ్డ ఆమె నెమ్మదిగా కోలుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. అడపాదడపా సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతూ యాక్టివ్‌గా మారుతున్న అనుష్క తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. ఇప్పుడు అది వైరల్‌ అవుతుంది. 

25
Anushka Shetty

ఇందులో అనుష్క చెబుతూ, `ప్రేమకి సంబంధించిన అన్ని రూపాలకు చిన్న తేడాతో విభిన్న మార్గాలుంటాయి. ఒకటి మీ హృదయానికి వెచ్చదనం ఇచ్చేదిగా, మరొకటి మా మార్గాలను మార్చేదిగా, ఇంకోటి మిమ్మల్ని మీతో ప్రేమలో పడేసేదిగా, అలాగే మీ సొంతం ప్రేమని మించినది, మనం చూసేది, గ్రహించే వాటికి మించిన వాటికి ప్రేమని పంచేదిగా ఉంటుంది. అయితే మనందరం ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ప్రేమని ఇవ్వడం తీసుకోవడం చేస్తుంటాం. ఇదంతా మనకు దక్కిన ఆశీర్వాదం. ఈ క్షణంలో మనం ఎక్కడ ఉన్నా అక్కడ కొంత ప్రేమ, అనుభూతిని పొందాలి. అది ఈ రోజు, ప్రతి రోజూ కూడా. ఇప్పటికీ, ఎప్పటికీ మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. ప్రేమించండి, క్షమించండి, ఎల్లప్పుడు నవ్వండి` అంటూ పేర్కొంది అనుష్క. 

35

ఇదిలా ఉంటే ప్రస్తుతం `జాతి రత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ లో ఈ చిత్రం రూపొందుతుంది. దీనికి `మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది అనుష్క. ఇందులో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఓ జబ్బు ఉన్నట్టు చెప్పింది. 

45

తనకు నవ్వే జబ్బు ఉందని చెప్పింది. నవ్వే జబ్బు అంటూ ఆరోగ్య సమస్య కాదు. కానీ తాను ఏ కామెడీ సన్నివేశానికైనా నవ్వాల్సి వస్తే దాదాపు పదిహేను నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటుందట. త్వరగా నవ్వుని కంట్రోల్‌ చేసుకోలేదట. ఆ నవ్వు పడి పడి నవ్వేలా ఉంటుందని చెప్పింది. తాను నవ్వడం స్టార్ట్ చేస్తే సినిమా సెట్‌లో షూటింగ్‌ ఆపేసుకోవాల్సిందే అట. పదిహేను ఇరవై నిమిషాల పాటు కంటిన్యూగా నవ్వుతూనే ఉంటానని, ఈ గ్యాప్‌లో కొందరు టిఫిన్లు కూడా కంప్లీట్‌ చేసుకుంటారని చెప్పింది. దీనిపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ నువ్వు ఎంత నవ్వినా మాకు ఆనందమే అని అంటుండటం విశేషం. 
 

55

అనుష్క శర్మ `జీరో సైజ్‌` తర్వాత బాగా డౌన్‌ అయ్యింది. ఈ సినిమాకోసం భారీగా బరువు పెరిగి తగ్గింది. అది తన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించింది. చాలా రోజుల వరకు బరువు కంట్రోల్‌ తప్పిందనే వార్తలొచ్చాయి. ఎంతకు కంట్రోల్‌ కావడం లేదట. అందుకే సినిమాల పరంగా ఆమె చాలా గ్యాప్‌ తీసుకుంది. దాదాపు మూడేళ్ల గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ నటిస్తుంది. అయితేఇప్పుడు ఆమె చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories