తెలుగు సినిమాలకు సమంత బై బై...? స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం నిజమేనా..?

First Published | Aug 15, 2024, 9:07 AM IST

ఆమధ్య వరకూ పెద్దగా వార్తల్లో నిలవలేదు స్టార్ హీరోయిన్ సమంత. కాని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోబుతన్నాడు అని తెలియడంతో..మరోసారి సోషల్ మీడియాలో సమంత వార్తలు వైరల్అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..? 
 

samantha divorce

చాలా కాలంగా కామ్ గా ఉంది సమంత. నాగచైతన్యతో విడాకులు తరువాత కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత ఏడాది పాటు రెస్ట్ తీసుకుంది. తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ఇక ఏడాది పాటు నెట్టింట్లో మాత్రమే కనిపించిన సమంత.. తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కారణం.. నాగచైతన్య నిశ్చితార్ధం. 

శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?
 

Samantha

శోభిత ధూళిపాల తో రీసెంట్ గా నాగచైతన్య  నిశ్చితార్థం జరిగింది. ఇక దీనిపై సామ్‌ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. తన మాజీ భర్త తాజా ఎంగేజ్మెంట్‌పై సామ్‌ ఏమనుకుంటుంది.. డైరెక్ట్ గా స్పందిస్తుందా లేదా..? ఓక వేళా ఇండైరెక్ట్ గా పోస్ట్ లు ఏమైనా పెట్టిందా అని ప్రతీ ఒక్కరు సోషల్‌ మీడియాను జల్లెడ పడుతున్నారు. కాని సమంత మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. 

Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?


అయితే సమంత స్పందించినా ఏమంటుంది.. ఏం చెపుతుంది అనేది ఉత్కంటగా మారింది. ఈక్రమంలో సమంతకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చైతూ రెండో పెళ్ళి విషయంలో సమంత స్పందించదలచుకోలేదట. స్పందించదట కూడా.. ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాను ప్రశాంతంగా ఉన్నానని.. ఈ విషయంలో మనసు పాడుచేసుకోవద్దని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

అంతే కాదు ఇకనుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని, కొన్నాళ్లు ముంబైలో కాని, చెన్నైలో కాని, గడపాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం కూడా ఆమె  ముంబైలోనే ఉంటుంది.  బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం సమంతకు అవకాశాలు లేవు. ఏసినిమాకు ఆమె సైన్ చేయలేదనే తెలుస్తోంది. బాలీవుడు నుంచి ఆమెకు ఎక్కువగా పిలుపులు రావడం అక్కడే ఉండాలని అనుకుంటుందట సామ్. 
 

బాలీవుడ్ నుంచి ఎక్కువగా  వెబ్‌ సిరీస్‌ కోసం ఆమెను ఎక్కువగా సంప్రదిస్తున్నట్టు సమాచారం. అంతే కాదు  ఈ వెబ్ షూటింగ్‌ల కోసం సమంత ఎక్కువగా  ముంబైలోనే గడుపుతుందట. అక్కడ ఆమెకు సొంత ప్లాట్ కూడా ఉన్నట్టు సమాచారం. దాంతో అక్కడే కొంత కాలం సమంత ఉండనున్నారట.  

నాగ చైతన్యతో విడాకులు తర్వాత ఎన్నో ఇబ్బందులు చూసిన సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయట పడుతున్నారు. ఇలాంటి సమయంలో నాగ చైతన్య మరో పెళ్ళికి రెడీ అవుతుండటంతో.. ఈ విషయంలో మీడియా సమంతను ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. స్పందించమనిఅడుగుతుంది. ఆ ఇబ్బంది రాకూడదనే.. ఆమె హైదరాబాద్ రావడం లేదు అనేది కొందరు వాదన. చూడాలి పరిస్థితి తరువాత ఏమౌతుందో..? 

Latest Videos

click me!