ప్రభాస్ కు చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్ ఎవరు..? ఏం చేసింది.

First Published | Aug 13, 2024, 6:46 PM IST

వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు పోటీ పడి ఉరుకులు పెడుతుంటారు. కాని ప్రభాస్ కే ఓ హీరోయిన్ చుక్కలుచూపించిందని మీకు తెలుసా..? 

prabhas new movie

బాహుబలి తరువాత వరుసగా హ్యాట్రిక ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాలిడ్ హిట్ కోసం.. ఎంతో ప్రయత్నం చేసిన ఆయనకు సలార్ సినిమాతో కాస్త ఊరట లభించగా.. కల్కి సినిమాతో.. ఆయన అనుకున్న సాలిడ్ హిట్ ప్రభాస్ కు దక్కింది. ఇదే జోరుతో నెక్ట్స్ నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టారు యూనివర్సల్ హీరో. 

ప్రభాస్ లిస్ట్ లో ప్రస్తుతం మారుతీతో రాజాసాబ్, సందీప్ రెడ్డి తో స్పిరిట్.. తోపాటు.. సలార్ 2.. హనురాఘవపూడి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓ నాలుగైదేళ్లు .. బిజీ షెడ్యూల్ ను పెట్టేసుకున్నాడు ప్రభాస్. కాగా మధ్యలో ప్లాప్ సినిమాలు వచ్చినా.. ఆయన ఇమేజ్ కు మాత్రం ఏమాత్రం డ్యామేజ్ జరగలేదు. 


ప్రభాస్ తో సినిమా అంటే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. స్టార్ హీరోయిన్లు అందరూ క్యూ కడతారు. దీపిక, కృతీ, శ్రద్దా కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు ప్రభాస్ జోడిలుగా నటించారు. కాని ఓ హీరోయిన్ వల్ల ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా కథా..? ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. 
 

అవును పూజాతో ప్రభాస్ ఒకే ఒక్క సినిమా చేశాడు. అదే రాధ్యేశ్యామ్. ఈమూవీ అద్భుతమైన ఇటాలియన్ ప్రేమ కథతో తెరకెక్కింది. కాని ఈమూవీలో ఏదో తేడా కొట్టి.. ప్లాప్ అయ్యింది. అదే టైమ్ లో హీరోయిన్ పూజా వల్ల ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డారట. ఒక రకంగా ప్రభాస్ కు ఆమె చుక్కలు చూపించిందని రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ మూవీ ప్లాప్ తో ఐరెన్ లెగ్ పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ఈసినిమా టైమ్ లోనే బీస్ట్, ఆచార్య సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో పూజాకు అవకాశాలుతగ్గిపోయాయి. ఇక రాధేశ్యామ్ సినిమా టైమ్ లో... షూటింగ్ కు సరిగ్గా రాకపోవడం.. లేట్ గా రావడం.. కొన్ని సీన్లు సరిగ్గా చేయకపోవడం.. ప్రభాస్ ను వెయిట్ చేయించడం లాంటివి చేసిందట. 
 

అయితే ఈ విషయాలపై రూమర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.. ఓ పుకారు మాత్రం నడిచింది. ఇక ప్రస్తుతం పెద్దగా సిమాలు చేతిలో లేక ఇబ్బందిపడుతుంది పూజా. మహేష్ బాబు సినిమా నుంచి బయటకు రావడం, విజయ్ దేవరకొండ సినిమా కూడా ఆగిపోవడంతో.. పూజా కెరీర్ కుఇబ్బందులు తప్పలేదు. 

Latest Videos

click me!