నాగ చైతన్య చెప్పిన `ఎస్‌` సమంత కాదా?.. జాతకం ప్రకారమే శోభితాని పెళ్లి చేసుకుంటున్నాడా?

First Published | Aug 13, 2024, 5:44 PM IST

నాగచైతన్య సమంతతో విడిపోయాక ఇప్పుడు శోభితాని వివాహం చేసుకోబోతున్నాడు. అయితే శోభితాని పెళ్లి చేసుకోవడమనేది జాతకంలో ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. 
 

నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇటీవలే హీరోయిన్‌ శోభితా దూళిపాళ్లతో ఆయన ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దల సమక్షంలోనే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దాన్ని అధికారికంగా ప్రకటించారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య.. శోభితాకి దగ్గరయ్యారని తెలుస్తుంది. అదే సమయంలో సమంతతో కలిసి ఉన్నప్పట్నుంచే ఈ ఇద్దరు క్లోజ్‌ అయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 

ఏదేమైనా నాగచైతన్య సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. త్వరలోనే మ్యారేజ్‌ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైతన్యకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. శోభితాని పెళ్లి చేసుకోవడానికి సంబంధించిన ఆయన దాదాపు 8ఏళ్ల క్రితమే హింట్‌ ఇచ్చాడంటూ అంటున్నారు. దాని ప్రకారం తన చిన్నప్పుడు జాతకం ప్రకారమే నాగచైతన్య.. శోభితాని పెళ్లి చేసుకుంటున్నాడనే చర్చ స్టార్ట్ అయ్యింది. 
 


నాగచైతన్య హిట్‌ సినిమా `ప్రేమమ్‌`. ఇది మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `ప్రేమమ్‌` చిత్రానికి రీమేక్‌. ఇందులో మూడు స్టేజస్‌లో లవ్‌ స్టోరీస్‌ ఉంటాయి. స్కూల్‌ డేట్‌లో ఒక క్రష్‌, కాలేజ్‌లో మరో క్రష్‌, ఫైనల్‌గా పెళ్లికి ముందు ప్రేమలో పడతాడు. అలాగే చివరి స్టేజ్‌లో మడోన్నాతో ఆయన ప్రేమలో పడతాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే సినిమాలో ఆమె పేరు సిందు. 
 

ఓ సీన్‌లో మడోన్నాతో తన లవ్‌ ని వ్యక్తం చేస్తూ, చిన్నప్పుడు నా జాతకంలో `ఎస్‌` అనే అక్షరం ఉన్న అమ్మాయితో పెళ్లి అవుతుందన్నారు. ఆ ఎస్‌ నువ్వే.. `ఎస్‌` ఫర్‌ సింధూ అని చెబుతాడు నాగచైతన్య. అయితే అది సినిమా అయినా, ఇప్పుడు దాన్ని రియల్‌ లైఫ్‌కి కనెక్ట్ చేస్తున్నారు నెటిజన్లు. `ఎస్‌` అంటే `శోభితా` అంటూ చర్చ స్టార్ట్ చేశారు. `ప్రేమమ్‌` సినిమా క్లిప్‌కి శోభితాకి ముడిపెడుతున్నారు. 
 

Samantha

అయితే ఇప్పటికే నాగచైతన్య.. `ఎస్‌` ఫర్‌ సమంతని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లలోనే విడిపోయారు. ఇప్పుడు మళ్లీ శోభితాని వివాహం చేసుకోబోతున్నాడు. ఇలా తన లైఫ్‌లో రెండు సార్లు ఎస్‌ అనే అక్షరం ఉన్న అమ్మాయిలను చైతూ పెళ్లి చేసుకుంటుండటం విశేషం. `ప్రేమమ్‌` సినిమాలో చైతూ చెప్పింది తన రియల్‌ లైఫ్‌ మ్యాటరా? అప్పుడే యువసామ్రాట్ హింట్‌ ఇచ్చాడని అంటున్నారు. అంతేకాదు `ఎస్‌` అంటే సమంత కాదు, శోభితా అంటున్నారు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

చైతూ, సమంత 2017లో వివాహం చేసుకుని 2021లో విడిపోయారు. ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటుంది. ఆమె మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతుంది. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలకు బ్రేక్ కూడా తీసుకుంది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి సన్నద్ధమవుతుంది. ఆమె ఇప్పటికే `మా ఇంటి బంగారం` చిత్రంలో నటిస్తుంది. అలాగే హిందీలో ఓ సినిమా చేయబోతుందట. 
 

శోభిత మన తెలుగమ్మాయి. ముంబైలో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. `రామన్ రాఘవన్ 2. 0`  మూవీతో వెండితెరకి పరిచయమైంది. తెలుగు ఆమె `గూడచారి`, `మేజర్` చిత్రాల్లో నటించింది. ఎక్కువా హిందీ సినిమాలు చేస్తుంది. గ్లామర్‌ విషయంలో బోల్డ్ఇమేజ్‌ని మూటగట్టుకుంది. మరి ఇకపై ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!