హీరోయిన్ తో మహేష్ బాబు లిప్ లాక్... నమ్రత ఏం చేసిందో తెలుసా..?

First Published | Aug 13, 2024, 4:51 PM IST

ఇవ్వక ఇవ్వక సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ హీరోయిన్ కు.. ఓ సినిమాలో లిప్ కిస్ ఇచ్చాడు. ఇక ఈ విషయంలో ఆయన భార్య.. మాజీ హీరోయిన్ నమ్రత రచ్చ రచ్చ చేసిందట. ఇంతకీ మహేష్ ఏసినిమాలో లిప్ లాక్ ఇచ్చాడు..? నమ్రత ఏం చేసింది..?
 

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు.. ఈసినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ ను టచ్ చేయబోతున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే మహేష్ బాబు.. ఆ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం అడల్ట్ సీన్లు కాని.. లిప్ లాక్ లు కాని.. బాడీ ఎక్స పోజ్ చేయడం లాంటివి మహేష్ సినిమాలో ఉండవు. మహేష్ బాబు అంత ఫిల్ గా ఉన్నా.. ఏరోజు షర్ట్ విప్పి సినిమాలో కనిపించలేదు. 

ఇక మహేష్ తో చాలామంది హీరోయిన్లు చేశారు. స్టార్ హీరోయిన్లు ఎంత ఎక్స్ పోజ్ చేసినా... మహేష్ సరసన నటించేప్పుడు హద్దులు దాటింది లేదు. ఇక సినిమాల్లో దర్శకులు ఒక వేళ ఇలాంటి సీన్లు రాసుకున్నా.. మహేష్ మాత్రం చేయరు.. రొమాంటిక్ సీన్స్ ను  కూడా తనదైన స్టైల్లో చేస్తుంటారు మహేష్ బాబు. ఈక్రమంలో మహేష్ బాబు గురించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 


ఇంతకీ విషయం ఏంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో లిప్ కిస్ సీన్ చేశారు. మహేష్ ఏంటి.. లిప్ లాక్ సీన్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.? అవును మహేష్ బాబు లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో కాదు త్రిష. ఆసినిమా ఏదో కాదు అతడు. ఎప్పుడో 20 ఏళ్ళక్రితం వచ్చిన అతడు సినిమాలో మహేష్ బాబు లిక్ లాస్ సీన్ చేశాడు అది చాలా మందికి తెలిసిన విషయమే. 

హోమ్లీ హీరోగా కనిపించిన ఈయన ఒక్కసారిగా ఆ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్,నడుము గిల్లడం వంటి సన్నివేశాల్లో నటించడం కారణంగా ఆయనలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది అని దర్శక నిర్మాతలు గ్రహించారు.అతడు సినిమా ఇప్పటికి బుల్లితెర మీద వచ్చినా చాలామంది అభిమానులు ఇష్టంగా చూస్తారు.ఇక ఈ సినిమాలో బావ మరదళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.అలా నడుమ గిల్లడం, ముద్దు పెట్టుకోవడం వంటివి మీరు ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సినిమాలో చూసే ఉంటారు. అయితే అతడు సినిమాలో త్రిష బావ పాత్రలో మహేష్ బాబు నటిస్తారు. 

ఈ సన్నివేశాలు చూసి  నమ్రత రచ్చ రచ్చ చేసిందట.  మహేష్ బాబు తో గొడవేసుకుందట. సూపర్ స్టార్ పై అలిగిందట. ఎందుకు ఇలాంటి సీన్లు చేస్తున్నావని  గోలగోల చేసిందట. నటుడిగా తప్పదని చెప్పినా వినలేదట. అయితే ఆతరువాత నమ్రతకు అర్ధం అయ్యేలా మహేష్ చెప్పినట్టు టాలీవుడ్ లో  ఓ రూమర్ గట్టిగా వినిపించింది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. మహేష్ మాత్రం ఆతరువాత ఇలాంటి సీన్లు చేయలేదు. 

Latest Videos

click me!