పూజా హెగ్డే ఆఫర్ ను కొట్టేసిన మృణాల్ ఠాకూర్, ఎంత పనిచేసింది..?

First Published | Feb 13, 2024, 11:14 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పూజాహెగ్డే చేయాల్సి సినిమా ఆఫర్ ను మృణాల్ ఠాకూర్ కొట్టేసిందట. అసలే ప్లాప్ ల తో సతమతం అవుతున్న ఈ స్టార్ బ్యూటీకి ఈ ఛాన్స్ కూడా లేకుండా చేసింది మరాఠీ బ్యూటీ.. ఇంతకీ అది ఏసినిమా ఆఫరో తెలుసా..? 
 

టాలీవుడ్ లో ఎన్నో ప్రేమ కథలు సినిమాలుగా ప్రేక్షకుల హృదయాలను  కొల్లగొట్టాయి. వెండితెరపే వెలుగు వెలిగిన ఎన్నో సినిమాలు ఆడియన్స్ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక ఈమధ్య కాలంలో పెద్దగా ప్రేమ కావ్యాలు రావడం లేదు. కాని రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా ఆలోటునుతీర్చింది. నిజంగా ప్రేమ కావ్యంలానే నిలిచింది సినిమా. 
 

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇద్దరి మధ్య ఇంత ప్రేమ.. అంత అద్భుతంగా స్క్రీన్ మీద చూపించగలగడం అది చిన్న విషయం కాదు. అందులో హను సక్సెస్ అయ్యారు. ఈసినిమాలో హీరోగా మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించగా.. హీరోయిన్ గా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. 
 


 అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతారామం సినిమాలో సీత మహాలక్ష్మీ పాత్రలో చూడచక్కగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్. అలాగే రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఇక ఈ అద్భుత ప్రేమ కావ్యాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు అనగా  ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా  ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. 
 

ఇక అసలు విషయానికి వస్తే.. సీరియల్ నటిగా కెరీర్ స్థార్ట్ చేసిన మృణాల్ ఠాకూరు.. ఈ సినిమాతో  తెలుగులో భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ కూడా లభించింది. ఈ సినిమా వల్ల ప్రస్తుతం  తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కాని ఈ క్యారెక్టర్ కాని.. ఈక్రేజ్ కాని.. మృణాల్ కు దక్కాల్సింది కాదట.. ఈసినిమా మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేయాల్సింది అంటున్నారు. 
 

ఈ సూపర్ హిట్ సినిమాను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే  మిస్ చేసుకుందట. అందాల భామ పూజాహెగ్డే.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ గా మారింది. కాని ఈమధ్య కాలంలో ఆమె సినిమాలన్నీ ప్లాప్ లుగా నిలుస్తున్నాయి. ఐరన్ లెగ్ అన్న పేరు కూడా వచ్చింది. ఆమె క్రేజ్ కూడా డౌన్ అవుతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తుంది. 
 

అయితే ఈ చిన్నది సీతారామం సినిమాను మిస్ చేసుకుందట. అయితే దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టరట దర్శకుడు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్  లైన్ లోకి వచ్చింది. సీత పాత్రతో అద్భుతం చేసింది..  ఇలా పూజా హెగ్డే సీతారామం సినిమాను మిస్ చేసుకుందట.
 

కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టరట దర్శకుడు. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్  లైన్ లోకి వచ్చింది. సీత పాత్రతో అద్భుతం చేసింది..  ఇలా పూజా హెగ్డే సీతారామం సినిమాను మిస్ చేసుకుందట.
 

Latest Videos

click me!