BrahmaMudi 13th february Episode:నిజం తెలుసుకున్న కావ్య, డబ్బు తీసింది అనామికే.. అపర్ణ క్లారిటీ..!

First Published | Feb 13, 2024, 10:49 AM IST

ఆ మాటలకు కావ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయట శ్వేత కావ్యకు ఎదురౌతుంది.

Brahmamudi

BrahmaMudi 13th february Episode:ఆఫీసులో మీటింగ్ అటెండ్ అయినందుకు  కావ్య పై రాజ్ కోప్పడుతూ ఉంటాడు. అసలు ఎవరిని అడిగి నువ్వు మీటింగ్ అటెండ్ అయ్యావ్ అని అడుగుతాడు. దానికి  కావ్య.. ఎవరిని అడగాలి అంటుంది..? నా పర్మిషన్ అడగాలి అని రాజ్ అంటాడు. మీరు మీ ఫియాన్సీతో కారులో షికారుకు వెళితే.. మీరు వచ్చే వరకు మీటింగ్ ఆపేయాలా అని కావ్య అడుగుతుంది. దానికి రాజ్.. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు అంటాడు. రేపు నీకు నేను విడాకులు ఇస్తే.. మా వాళ్లు అందరూ నీకు సపోర్ట్ రావాలని ఈ విధంగా చేస్తున్నావ్ అంటాడు. దానికి కావ్య తనది అంత చీప్ క్యారెక్టర్ కాదు అని, మర్యాదగా మాట్లాడమని  చెబుతుంది.

Brahmamudi

నేను మీకు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. కళ్యాణ్ చేశాడు.. వస్తున్నాఅన్నారు.. ఎంత సేపటికీ రాలేదు. క్లైంట్ మీటింగ్ లేటు అవుతుందని మామయ్యగారు కంగారుపడుతున్నారు..? నేనేం చేయాలి? అయినా నేను మీరు వేసిన డిజైన్స్ చూపించి శెభాష్ అనిపించుకోలేదు.. నేను వేసిన డిజైన్స్  చూపించాను అని అంటుంది. ఇదే విషయంపై ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. తర్వాత.. శ్వేతకు విడాకులు వస్తాయని.. వెంటనే నేను నీకు విడాకులు ఇచ్చి, శ్వేత నేను పెళ్లి చేసుకుంటాం అని రాజ్ చెబుతాడు. ‘నేను ఏదో మారతానని, శ్వేతను నా నుంచి దూరం చేయాలనే నువ్వు ఆఫీసులో చేరావని నాకు తెలుసు, కానీ నేను మారను. నిన్ను ఎఫ్పటికీ భార్యగా ఒప్పుకోను, అర్థం అయ్యిందా? నా జీవితం నుంచి తప్పుకో.. వెళ్లిపో..’ అని అరుస్తాడు. ఆ మాటలకు కావ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయట శ్వేత కావ్యకు ఎదురౌతుంది.


Brahmamudi

పాపం కావ్య బాధ చూసి శ్వేత కూడా బాధపడుతుంది, రాజ్ కి కౌంటర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి సీరియస్ గా లోపలికి వెళ్తుంది. వెళ్లి రాజ్ ని తిడుతుంది. కావ్య గుండె పగిలిపోయాలే ఎలా మాట్లాడవ్.. ఇలా మాట్లాడితే కావ్య ఏమౌపోతుంది అని అడుగుతుంది. అయితే.. రాజ్ కూల్ గా తనకు దూరం అవుతుందని.. కనీసం అలా అయినా నా జీవితం నుంచి వెళ్లిపోతుందని చెబుతాడు. ‘ అవును శ్వేత.. కళావతి నన్ను పెళ్లి చేసుకొని సుఖపడింది లేదు.నా లాంటి వాడితో కలిసి ఉండటం కంటే.. విడిపోయి  సంతోషంగా ఉండటమే ముఖ్యం అని తాను అనుకోవాలి. ఆమెకు నాపై మనసు విరిగిపోవాలి. అందుకే నేను లేని కోపాన్ని ప్రదర్శించాను. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని, నా మనస్సాక్షి ఒప్పుకోకపోయినా కోపంగా మాట్లాడాను. నాకు తెలుసు. నా మాటలతో తన గుండె పగిలిపోతుందని, అలానే ఆ గుండెల్లో ఉన్న నా రూపం కూడా ముక్కలైపోతుందని. ఏం చేసినా కళావతి పట్ల నాకు ప్రేమ కలగడం లేదు. ఏ ఫీలింగ్ లేకుండా కలిసి ఎలా కాపురం చేస్తాను? ఇద్దరు కలిసి ఉండాలంటే ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండాలి?’అని రాజ్ చెబుతూ ఉంటాడు.

Brahmamudi

ఏడుస్తూ బయటకు వచ్చిన కావ్యకు సందేహం వస్తుంది. తన తప్పు లేకపోయినా ఎందుకు ఏడుస్తూ బయటకు వెళ్లిపోవాలి? కడిగిపారేయకుండా ఎందుకు రావాలి? సిగ్గుతో తల దించుకునేలా దులిపేయాలి  అని ఫిక్స్ అయ్యి లోపలికి వస్తుంది. అప్పుడే రాజ్  మాటలు కావ్య చెవినపడతాయి

Brahmamudi

‘ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబితే అయినా కావ్య మనసు విరిగి నాకు దూరమైపోతుంది. అందుకే మన స్నేహం అడ్డు పెట్టుకున్నాను ’ అని రాజ్ అంటాడు.

Brahmamudi

నీ భార్య నా గురంచి తప్పుగా అనుకుంటుంది కదా అని శ్వేత అంటే.. అయినా సరే.. తను నాకు దూరం అయితే చాలు అని రాజ్ అంటాడు. ఆ మాటలకు కావ్య మరింత బాధపడుతుంది. ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. ఇంట్లో అనామిక, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అత్తగారిని అపర్ణ ఒదిన మరీ తక్కువ చేసి మాట్లాడుతోంది అని రుద్రాణి అంటోంది. నువ్వు మీ అత్తకి సపోర్ట్ గా మాట్లాడొచ్చు కదా అని రుద్రాణి అంటే... మా అత్తకే దిక్కులేదు.. ఇక నన్ను కరివేపాకులా తీసిపారేస్తుంది అని అనామిక అంటుంది. వీళ్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే.. అపర్ణ వస్తుంది. ఈ లోగా ఓ వ్యక్తి వస్తాడు. అతను వచ్చి సుభాష్ సర్ పంపించారని, ఇంటి నుంచి రూ.5లక్షల క్యాష్ తీసుకొని రమ్మన్నారు అని చెబుతాడు. ఇస్తాను అని అపర్ణ వెళ్తుంది. తీరా చూస్తే.. అందులో రూ.2లక్షలు తగ్గుతాయి. ఎవరూ తీయకుండా డబ్బు ఏమై ఉంటుందా అని అపర్ణ ఆలోచనలో పడుతుంది. డబ్బు విషయం బయటపడుతుందని.. రుద్రాణి, అనామికలు సంబరపడుతూ ఉంటారు.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. ఇంట్లో అనామిక, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అత్తగారిని అపర్ణ ఒదిన మరీ తక్కువ చేసి మాట్లాడుతోంది అని రుద్రాణి అంటోంది. నువ్వు మీ అత్తకి సపోర్ట్ గా మాట్లాడొచ్చు కదా అని రుద్రాణి అంటే... మా అత్తకే దిక్కులేదు.. ఇక నన్ను కరివేపాకులా తీసిపారేస్తుంది అని అనామిక అంటుంది. వీళ్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే.. అపర్ణ వస్తుంది. ఈ లోగా ఓ వ్యక్తి వస్తాడు. అతను వచ్చి సుభాష్ సర్ పంపించారని, ఇంటి నుంచి రూ.5లక్షల క్యాష్ తీసుకొని రమ్మన్నారు అని చెబుతాడు. ఇస్తాను అని అపర్ణ వెళ్తుంది. తీరా చూస్తే.. అందులో రూ.2లక్షలు తగ్గుతాయి. ఎవరూ తీయకుండా డబ్బు ఏమై ఉంటుందా అని అపర్ణ ఆలోచనలో పడుతుంది. డబ్బు విషయం బయటపడుతుందని.. రుద్రాణి, అనామికలు సంబరపడుతూ ఉంటారు.

Brahmamudi

కానీ, అపర్ణ ఈ విషయం బయటపడకుండా  మిగలిన డబ్బు ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెబుతుంది. వెంటనే రుద్రాణి.. అన్నయ్య రూ.5లక్షలుు అడిగితే.. నువ్వు రూ.3లక్షలే ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతుంది. కానీ లాకర్ లో రూ.2లక్షలు మిస్ అయ్యాయి అని అపర్ణ చెబుతుంది. వెంటనే రుద్రాణి, అనామిక పర్ఫార్మెన్స్ మొదలుపెడతారు. ఎవరు తీసి ఉంటారు అని రుద్రాణి అంటే.. కావ్య మీద ధాన్యలక్ష్మి నింద వేస్తుంది. వెంటనే.. అపర్ణకు కోపం వచ్చి అరుస్తుంది.

Brahmamudi

ఇలా తాళాలు ఇవ్వగానే నీ కోడలు రూ.2లక్షలు తీసేసింది అని ధాన్యలక్ష్మి అంటుంది. రుద్రాణి మరో పక్కన రెచ్చగొడుతూ ఉంటుంది. అవసరమై తీసుకుందేమో అని అపర్ణ అంటే.. చెప్పి తీసుకోవచ్చు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే.. అపర్ణ.. అంటే ఏంటి.. కావ్య డబ్బు తీసింది అంటావా అని అడుగుతుంది. మరి నువ్వు తాళాలు ఇచ్చింది నీ కోడలికే కదా అని ధాన్యం అంటే.. ఆ తాళాలు నాకు తిరిగి ఇచ్చింది నీ కోడలే కదా అని అపర్ణ అంటుంది. మొత్తం అనామిక వైపు తిరుగడంతో అందరూ షాకౌతారు. నీ కోడలిని కూడా అనుమానించాలి కదా.. తాళాలు దొరకగానే రూ.2లక్షలు తీసిందని నేను కూడా అనాలి కదా అని అపర్ణ అంటుంది.

Brahmamudi

అటు తిప్పి, ఇటు తిప్పి అమాయకురాలైన అనామికను లాగుతారేంటి అని రుద్రాణి అంటుంది. కానీ ధాన్యలక్ష్మి మాత్రం.. నీ కోడలికి పుట్టిల్లు ఉంది కదా అక్కడికి చేర్చిందేమో అని ధాన్యలక్ష్మి అంటే... నీ కోడలికి మాత్రం పుట్టిల్లు లేదా అని ప్రశ్నిస్తుంది. కావ్య వచ్చాక అసలు విషయం తేలుతుందని చెప్పి అపర్ణ లోపలికి వెళ్తుంది. అయితే.. కోడలికి పట్టం కట్టినందుకు మా అక్కకు కోపం వచ్చింది.. నేను ప్రశ్నించానని అహం దెబ్బతిన్నదని.. ఈరోజు కావ్య దొంగ అని తేలుతుందని ధాన్యలక్ష్మి సంబరపడుతుంది. అయితే.. మధ్యలో తన పేరు తీసుకువచ్చినందుకు అనామిక మాత్రం టెన్షన్ పడుతుంది.

Brahmamudi

ఇక కావ్య కారులో ఇంటికి బయలుదేరుతుంది. మధ్యలో కారు బ్రేక్ డౌన్ అవుతుంది. డ్రైవర్ చెక్ చేస్తూ ఉంటాడు. రిపేర్ అవ్వడానికి టైమ్ పడుతుందని కావ్య క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోగా.. రాజ్ అక్కడకు వస్తాడు. ఏమైందా అని కారు ఆపుతాడు. డ్రైవర్ ని ఏమైందని అడిగితే.. ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చిందని చెబుతాడు. 

రాజ్ వచ్చి కావ్యను కారు ఎక్కమని అంటాడు. కానీ కావ్య ఎక్కదు. ఏ అధికారంతో అడుగుతున్నావ్ అని కావ్య అంటే.. మొగుడు అనే అధికారంతో చెబుతున్నా అంటాడు. కాసేపు వాధించుకున్న తర్వాత.. తాను తన పుట్టింటికి వెళ్తున్నాను అని చెబుతుంది. దీంతో..రాజ్ స్వయంగా కావ్యను ఇంటి దగ్గర దింపుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Videos

click me!