ప్రభాస్‌ ఉన్నా `కన్నప్ప`ని కాపాడలేడా?.. ఇప్పట్నుంచే భయపెడుతున్నారే.. రజనీ ఎంత పనిచేశావయ్యా?

First Published | Feb 13, 2024, 9:57 AM IST

మంచు విష్ణు సినిమా `కన్పప్ప`పై అప్పుడే ట్రోల్‌ నడుస్తుంది. ఈ మూవీని ఇప్పట్నుంచే భయపెడుతున్నారు నెటిజన్లు. రజనీకాంత్‌ సినిమాని చూపించి ర్యాగింగ్‌ చేస్తున్నారు. 
 

మంచు విష్ణు హీరోగా `కన్నప్ప` రూపొందుతుంది. మైథలాజికల్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది. కన్నప్ప పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఇందులో ప్రభాస్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఆయన శివుడిగా కనిపిస్తాడని సమాచారం. వీరితోపాటు మోహన్‌లాల్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్‌బాబుతోపాటు నయనతార కూడా నటిస్తారని తెలుస్తుంది. 

మంచు ఫ్యామిలీలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. సుమారు వంద కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌లో ఈ మూవీని చిత్రీకరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఓ సెంటిమెంట్‌ భయపెడుతుంది. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. దానికి కారణం రజనీకాంత్ కావడం గమనార్హం. 


రజనీకాంత్‌ ఇటీవల `లాల్‌ సలామ్‌`లో నటించారు. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇది. రజనీ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా వంటి బిగ్‌ బ్యానర్‌ నిర్మించింది. ఈ సినిమా డిజాస్టర్‌ గా నిలిచింది. సూపర్‌ స్టార్‌ రజనీ ఉన్నా ఈ సినిమాని కాపాడలేకపోయాడు. సినిమాలు దమ్ములేకపోవడంతో ఎవరూ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే `కన్నప్ప`ని, మంచు విష్ణుని భయపెడుతుందట. 

మంచు విష్ణు హీరోగా `కన్నప్ప` చిత్రం రూపొందుతుంది. బాలీవుడ్‌ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, నయనతార నటిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. కానీ `కన్నప్ప` కి `లాల్‌సలామ్‌`కి జరిగిందే జరుగుతుందా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. పస లేని సినిమాలకు బిగ్‌ స్టార్‌ కాస్ట్ ఉన్నా ప్రయోజనం లేదని అంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు `కన్నప్ప` పై ట్రోల్‌ నడుస్తుంది. 

`కన్నప్ప` సినిమాని అప్పుడే పసలేని సినిమాగా తేల్చేస్తున్నారు నెటిజన్లు. రజనీకాంత్‌ నటించిన `లాల్‌ సలామ్‌` పరిస్థితే ఈ మూవీకి ఎదురు అయ్యే అవకాశం ఉందని, ప్రభాస్‌, మోహన్‌లాలు కూడా ఏం చేయలేరని అంటున్నారు. సినిమాలో మ్యాటర్‌ లేకపోతే ఈ ఇద్దరు బిగ్‌ స్టార్స్ కూడా కాపాడలేరని భయపెడుతున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో వరుసగా ఇలాంటి పోస్ట్ లతో రచ్చ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

అయితే మోహన్‌బాబు ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికోసం తమ సర్వం వడ్డిస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైన పెద్ద హిట్‌ కొట్టి మంచు వారి ఫ్యామిలీ కమ్‌ బ్యాక్‌ కావాలనుకుంటుంది. గత కొంత కాలంగా వీరి సినిమాలు ఆదరణ పొందడం లేదు. బాక్సాఫీసు వద్ద కనీసం కూడా ప్రభావాన్ని చూపించడం లేదు. దీంతో ఇప్పుడు `కన్నప్ప`తో తామేంటో నిరూపించుకోవాలనే కసితో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. పైగా బాలీవుడ్‌ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఇంత పకట్బందిగా మూవీని చేస్తుంటే పరాజయం ఎలా వస్తుందనేది మరో వాదన. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్‌ చేయాల్సిందే. ఈ మూవీని దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు సమాచారం. 
 

Latest Videos

click me!