జయసుధను జుట్టుపట్టి కొట్టిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? వీరిద్దరి మధ్య అసలు గొడవేందుకు వచ్చింది?

Published : Apr 02, 2025, 12:56 PM IST

అలనాటి అందాల తార జయసుధను  ఓ స్టార్ హీరోయిన్ జుట్టుపట్టి ఈడ్చుకుంటూ కొట్టిందట. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరు? ఎందుకు అలా  కొట్టింది. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది?  

PREV
16
జయసుధను జుట్టుపట్టి కొట్టిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? వీరిద్దరి మధ్య అసలు గొడవేందుకు వచ్చింది?
Hands Up Movie

సహజనటిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో  పేరుతెచ్చుకున్న హీరోయని్ జయసుధ. నటన, అందం, డాన్స్ ఇలా అన్ని విషయాల్లో జయసుధ చాలాప్రత్యేకమనే చెప్పాలి. జయసుధకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పటికీ ఆమె ఉందంటే.. ఆ సినిమానుమిస్ అవ్వకుండా చూసే అభిమానులు ఉన్నారు. హీరోయిన్ గా ఉన్నరోజుల్లో జయసుధకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, మురళీ మోహన్ తో పాటు మోహన్ బాబుతో కూడా జయసుధ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. 

Also Read:  రామ్ చరణ్ మిస్ అయిన టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా? అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ ఎన్ని?

26

ఆ కాలంలో తెలుగు హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడంటే అసలు తెలుగు హీరోయిన్లు లేరు, ఉన్న మన మేకర్స్ వారిని పట్టించుకోరు. అప్పుడు అయితే తెలుగు హీరోయిన్లు పోటీపడేవారు, అంతే కాదు సినిమాల వరకే ఆ పోటీ ఉండేది. పర్సనల్ గా మాత్రం అందరు మంచిగా ఉండేవారు. కొంత మంది మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా.. కలిసి మెలిసి కుటుంబంలా  ఉండేవారు.  కొన్ని సందర్భాల్లో మాత్రం కొంత మంది హీరోయిన్లు  అందరి ముందే గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది. 

Also Read:  స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?

36

ఈక్రమంలో  సహజనటి జయసుధతో ఓ హీరోయిన్ గొడవపడి కొట్టుకునే స్థాయికి వచ్చిందట. ఆ గొడవ పెద్దదయ్యి.. షూటింగ్ లోనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారట. ఇదంతా  కటకటాల రుద్రయ్య సినిమా టైమ్ లో జరిగిందట. జయసుధ గొడవపడిన హీరోయిన్ ఎవరో కాదు  జయచిత్ర.  ఈ విషయాన్ని జయసుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.  

Also Read:  సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?

46

ఆమె మాట్లాడుతూ..  కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరగుతోంది. ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను. కాని జయచిత్ర పొట్టిగా ఉండటంతో.. నన్ను హీల్స్ తీయ్యమంది. ఎందుకుంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్... హీల్స్ వేసుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. దాంతో  నేను హీల్స్ తీసేశాను. కాని ఎందుకో తెలియదు మాట మాట పెరిగింది. సినిమా కోసం సీన్లో కొట్టుకోవాల్సింది.. జుట్టు జుట్టు పట్టుకుని నిజంగానే కొట్టుకోవడం మొదలు పెట్టాము. 

Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

56

అందరు సినిమా సీన్ అనుకుని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. మేము కూడా రెచ్చిపోయి కొట్లాడుకున్నాము అని అన్నారు జయసుధ. జుట్టు పట్టుకుని మేం కొట్టుకుంటుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారన్నారు. కాని  అప్పుడు జరిగిన సంఘటన ఆతరువాత ఎప్పుడు మేమ్ గుర్తు పెట్టుకోలేదు, ఎప్పుడూ ప్రస్తావించలేదు, ఎవరూ మనసులో కూడా పెట్టుకోలేదన్నారు జయసుధ. 

Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?

66

తరువాత రోజుల్లో కూడా కలిసి మాట్లాడుకునేవారం. ఫంక్షన్లు పార్టీలకు వెళ్ళేవాళ్లం, కాని అప్పుడు  అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్ధం కావడంలేదు అన్నారు జయసుధ.  ఇక ప్రస్తుతం జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. కాని ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లు ఫారెన్ లో ఉంటూ.. కొన్నాళ్లు ఇండియాలో ఉంటూ లైఫ్ ను గడిపేస్తున్నారు. గతంలో పాలిటిక్స్ లో కూడా రాణించిన ఆమె.. సికింద్రబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 

Also Read:సమంతకు గుడి కట్టిన వీరాభిమాని, స్టార్ హీరోయిన్ టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?

Read more Photos on
click me!

Recommended Stories