నేను రేపోమాపో పోతాను, రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ ఎమోషనల్ రిక్వస్ట్.. చెప్పడం ఈజీనే, యాంకర్ రష్మీ రియాక్షన్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతోంది. హెచ్ సి యు విద్యార్థులు గత కొన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు.

Renu Desai emotional request to CM Revanth Reddy over HCU land controversy in telugu dtr
Renu Desai

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతోంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దిగి విధ్వంసం మొదలు పెట్టాయి. అయితే ఆ 400 ఎకరాల భూమికి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు అని ప్రభుత్వం వాదిస్తోంది. 

Renu Desai emotional request to CM Revanth Reddy over HCU land controversy in telugu dtr
HCU Lands

హెచ్ సి యు ల్యాండ్ వివాదం 

హెచ్ సి యు విద్యార్థులు గత కొన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల అరెస్ట్ తో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీలు కూడా ఈ వివాదంపై స్పందించడం ప్రారంభించారు. ప్రభుత్వం 400 ఎకరాల ల్యాండ్ ని డెవలప్ మెంట్ కోసం టీజీఐఐసీ సంస్థకి కేటాయించారు. అందువల్లే విద్యార్థులు ధర్నాకి దిగారు. ఇప్పటికే ఈ వివాదంపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించిన సంగతి తెలిసిందే. 


ప్రశ్నించిన కల్కి డైరెక్టర్ 

ఐటీ పార్క్ కోసం 400 ఎకరాల చెట్లని ధ్వంసం చేయడం ఎందుకు .. డెవలప్ చేయాలి అంటే చెట్లు లేని భూములు చాలా ఉన్నాయి కదా అని నాగ్ అశ్విన్ ఇటీవల ప్రశ్నించారు. తాజాగా రేణు దేశాయ్ అయితే ఎంతో ఎమోషనల్ గా, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అందరికీ నమస్కారం.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం. 2 రోజుల క్రితమే నాకు హెచ్ సి యూ వివాదం గురించి తెలిసింది. దాని గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. అందుకే ఈ రిక్వస్ట్ చేస్తున్నా. సర్.. ఒక తల్లిగా నేను ఈ రిక్వస్ట్ చేస్తున్నా. 

Renu Desai

రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్ 

నాకు ఆల్రెడీ 44 ఏళ్ళు వచ్చేశాయి. రేపో మాపో పోతాను. నా గురించి నాకు బాధ లేదు. ఇది నా పిల్లల కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం. మనం బతకడానికి ఆక్సిజన్, నీరు కావాలి. అభివృద్ధి కూడా అవసరమే. ఐటీ పార్కులు, ఆకాశాన్ని తాకే భవనాలు అన్నీ అవసరమే. కానీ కుదిరితే ఈ ఒక్క 400 ఎకరాలు వదిలేయండి. తెలంగాణ సిటిజన్ గా నేను వేడుకుంటున్నా. దయచేసి ఏదో విధంగా దీనిని ఆపండి సార్. మనకి ఇంకా వేరే చోట్ల వేల ఎకరాల్లో ల్యాండ్ ఉంది. మీరు నాకంటే చాలా సీనియర్. మీ ముందు నేను చాలా చిన్నదాన్ని. ఒక తల్లిగా మాత్రమే నేను రిక్వస్ట్ చేస్తున్నా. ఆ 400 ఎకరాల్లో విధ్వంసం వద్దు' అని రేణు దేశాయ్ వేడుకున్నారు. 

వీడియో కోసం ఇక్కడ చూడండి 

కబుర్లు చెప్పడం సులభం : రష్మీ గౌతమ్ 

యాంకర్ రష్మీ గౌతమ్ కూడా దీనిపై స్పందించారు. అయితే రష్మీ గౌతమ్ వర్షన్ వేరే విధంగా ఉంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు బహుశా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ నేను ఈ వీడియోను రాజకీయ కోణంలో చేయలేదు. మన దేశంలో, ఏపీ, తెలంగాణలో జరుగుతున్న డెవలప్ మెంట్ కి విరుద్ధంగా నేను ఈ పోస్ట్ చేయలేదు. హెచ్ సీ యు విద్యార్థులు చేస్తున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. నేను ఇప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నా. ఈ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగే సమయంలో ఎన్ని చెట్లు తొలగించి ఉంటారో, ఎన్ని జంతువులు ఆశ్రయం కోల్పోయి ఉంటాయో ఊహించుకోగలను. ఇలా కూర్చుని కబుర్లు చెప్పడం చాలా సులభం. 

ఈ వివాదంలో తప్పొప్పులు ఎవరివి అనే విషయం జోలికి వెళ్ళను. కానీ అక్కడ చెట్లు తొలగించడం వల్ల చాలా జంతువులు, పక్షులు ఆశ్రయం కోల్పోతున్నాయి. వేసవి మరింత ఎక్కువ కాబోతోంది. ఈ టైంలో జంతువులని వాటి ఇంటి నుంచి తరిమేయడం ఎంత వరకు కరెక్ట్ ? నేను కోరుకునేది ఒక్కటే. ఆ పశు పక్షులకు ఆశ్రయం కల్పించిన తర్వాతే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా అంటూ రష్మీ పేర్కొంది. 

మెగా కోడలు ఉపాసన రియాక్షన్ 

మెగా కోడలు ఉపాసన కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హెచ్ సీ యులో అసలేం జరుగుతోంది. రాత్రికి రాత్రే బుల్డోజర్ లు దిగిపోయాయి, విద్యార్థుల అరెస్ట్ లు జరుగుతున్నాయి. ఇది నిజంగా జరుగుతుంటే అక్కడ ఉన్న జంతువులకు, పక్షులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారు.. తొలగించిన చెట్లకి బదులు కొత్త మొక్కలు ఎక్కడ నాటుతారు ? అని ఉపాసన ప్రశ్నించారు. 

Latest Videos

vuukle one pixel image
click me!