చిరంజీవి డాన్స్ చూసి బెదిరిపోయిన స్టార్‌ హీరో, శ్రీదేవితో ఆ పనిచేయించడానికి అభ్యంతరం!

Published : Jan 18, 2025, 02:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన డాన్స్ లకు కేరాఫ్‌. మొదట్లో ఆయన అందరి దృష్టిని ఆకర్షించింది కూడా ఆ డాన్స్ తోనే. కానీ ఓ పెద్ద స్టార్‌ హీరో మాత్రం అప్పట్లో చిరు డాన్స్ లకు భయపడ్డాడట.   

PREV
16
చిరంజీవి డాన్స్ చూసి బెదిరిపోయిన స్టార్‌ హీరో, శ్రీదేవితో ఆ పనిచేయించడానికి అభ్యంతరం!

చిరంజీవి ప్రారంభం నుంచి మంచి డాన్సర్‌ అనే విషయం తెలిసిందే. ఆయన డాన్సులే అప్పట్లో సినిమా మేకర్స్ ని ఎట్రాక్ట్ చేశాయి. అందరి చూపు ఆయన వైపు తిప్పేలా చేశాయి. అప్పటి వరకు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు ఎగురుతూ, గంతులేస్తూ డాన్సు చేసేవారు. కానీ రియల్‌ డాన్స్ ఏంటో చూపించాడు చిరంజీవి. దీంతో ఇండస్ట్రీలోకి సునామీలా దూసుకొచ్చాడు. 

26

చిరంజీవి డాన్సులు చూసి హీరోయిన్లు కూడా ముచ్చటపడేశారు. ఆయన ఫైట్లు, డాన్సులకు యమ క్రేజ్‌ ఉండేది. చిరంజీవి అనతి కాలంలోనే స్టార్‌ అయ్యారంటే, ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలు కట్టారంటే అదే కారణం. అయితే అది చూసి ఓ సూపర్ స్టార్ భయపడ్డాడు. తన సినిమాలో చిరంజీవి చేత డాన్స్ చేయించడానికి అభ్యంతరం చెప్పాడట. తన సినిమాలో నటించడానికి ఆయన తిరస్కరించాడట. ఆయన ఎవరో కాదు సోగ్గాడు శోభన్‌ బాబు. 
 

36

శోభన్‌బాబు అప్పటికే స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయన హీరోగా రాఘవేంద్రరావు `మోసగాడు` అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీదేవి హీరోయిన్‌. ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి ట్రెడిషనల్‌గా ఉండే పాత్ర. రెండోది వ్యాంపుగా కనిపించే పాత్ర. ఇందులో చిరంజీవి నెగటివ్‌ రోల్‌ చేశారు. అయితే పూర్తిగా విలన్‌ కాదు, నెగటివ్‌ షేడ్‌ ఉన్నా రోల్‌. 
 

46

శోభన్‌బాబు డాన్సులు మామూలుగానే ఉంటాయి. ఓ పార్టీ సాంగ్‌లో శ్రీదేవితో చిరంజీవిని డాన్సు చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దర్శకుడు రాఘవేంద్రరావు పాటలు చిత్రీకరించడంలో దిట్ట. బాగా డాన్సులు చేస్తున్న చిరంజీవి, శ్రీదేవి మీద సాంగ్‌ పెడితే బాగుంటుందనుకున్నారు. ఈ విషయాన్ని శోభన్‌బాబు కి చెప్పారట. అంతే ఆయన బెదిరిపోయాడు. హీరో తాను, తనపై కాకుండా విలన్‌గా చేస్తున్న చిరంజీవిపై డాన్స్ అంటే క్రెడిట్‌ అంతా ఆయనే కొట్టాస్తాడని నో చెప్పాడట. 

56

అయితే శ్రీదేవి వ్యాంపు పాత్ర ట్రాక్‌, శోభన్‌బాబు ట్రాక్‌ వేరు. మీకు సమస్య రాదు అని భరోసా ఇవ్వడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నాడట. అలా `మోసగాడు` సినిమాలో శ్రీదేవి, చిరంజీవి కలిసి ఫస్ట్ టైమ్‌ డాన్స్ చేశారు. అదరగొట్టారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి మూవీ కూడా ఇదే. కాసేపు కనిపించే పాత్ర ఇది. ఎక్స్ టెండెడ్‌ కోమియో అని చెప్పొచ్చు. పాటకి విశేషం స్పందన లభించిందట. అది చిరంజీవి డాన్స్ పవర్‌.

66

సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న శోభన్‌ బాబే అప్పట్లో చిరంజీవి డాన్సులకు భయపడటం విశేషం. చిరు, శోభన్‌బాబు కలిసి `రక్త సింధూరం`, `చాంది ప్రియా`, `మోసగాడు` , `బంధాలు అనుబంధాలు` చిత్రాలు చేశారు. 1980లో వచ్చిన `మోసగాడు` మూవీ పెద్ద విజయం సాధించింది. 

ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతుందని తెలుస్తుంది. 

read more: రెండు షిఫ్టుల్లో ప్రభాస్‌ హీరోయిన్‌.. మార్నింగ్‌ పవన్‌, మధ్యాహ్నం డార్లింగ్‌.. రెండు స్టేట్స్ లో చక్కర్లు

also read: రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి రిపేర్లు, గేమ్ ఛేంజర్ దెబ్బకు నెక్స్ట్ కథలో మెగాస్టార్ మార్పులు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories