మీడియా ముందు ఏ మాట్లాడుతున్నామో, దేని గురించి మాట్లాడుతున్నామో తెలియకుండా చెప్పుకుంటూ పోతే తర్వాత విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులోనూ గతంలో లాగ దేనికీ టైమ్ పట్టడం లేదు. ఒక మాట మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతోంది. చిన్న పొరపాటు ఉన్నా వివాదమై పోతోంది. దాంతో క్షమాపణ పర్వం మొదలువుతోంది. ఇప్పుడు ఊర్వశి రౌతేలా పరిస్దితి అదే. ఆమె సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇంతకీ ఆమె సైఫ్ విషయంలో ఏమి మాట్లాడింది
25
సైఫ్‌పై జరిగిన దాడి రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎంతోమంది సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ దాడి గురించి నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. అయితే, ఆ సమయంలో ఊర్వశీ (Urvashi Rautela) తన వజ్రపు ఉంగరాన్ని చూపించడం దాని గురించి మాట్లాడటం మొదలెట్టింది. అదే తీవ్ర విమర్శలకు దారితీసింది.
35
తాజాగా ఈ విషయంపై ఆమె సైఫ్‌కు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సైఫ్ సర్.. మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నా. మీ గురించి మాట్లాడే సమయంలో నేను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తంచేస్తున్నా. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు తెలియదు.
45
గత కొన్ని రోజుల నుంచి నేను ‘డాకు మహారాజ్’ విజయోత్సాహంలో ఉన్నాను. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన బహుమతులు గురించి మాట్లాడాను. ఈ విషయంలో సిగ్గు పడుతున్నా. నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీపై గౌరవం పెరిగింది’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సైఫ్ కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
55
‘డాకు మహారాజ్’ సక్సెస్ కావడంతో తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని ఊర్వశీ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, తన బహుమతులను దాడికి ముడిపెట్టి మాట్లాడడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు రూ.150కోట్లు వసూళ్లు సాధించింది. నాకు మా అమ్మ వజ్రపు ఉంగరం గిఫ్ట్‌గా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్ వాచ్ ఇచ్చారు. కానీ, వీటిని బహిరంగంగా ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి చేస్తారనే భయం ఉంటుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు.