4 ఏళ్లు వీల్ చైర్ లో.. 23 సర్జరీలు.. భారీ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? షాక్ అవుతారు.

First Published | Jul 27, 2024, 3:04 PM IST

అతను సౌత్ ఇండియాలో స్టార్ హీరో..? ప్రయోగాలకు పెట్టింది పేరు. సాహసాలు చేయడానికి వెనకాడని ధైర్యవంతుడు.. భారీ యాక్సిడెంట్.. పెద్ద ఎత్తున దెబ్బలు తగిలినినా..కోలుకుని స్టార్ గా మారిన ఆ వ్యక్తి ఎవరోతెలుసా..? 
 

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం.. రంగురంగులు తెర వెనక విషాద ఛాయలు ఉంటాయి. నవ్వుతూ నవ్విస్తూ తెరపై కనిపించే స్టార్ల జీవితాల వెనక ఎన్నో విషాదాలు కూడా ఉంటాయి. ఈక్రమంలోనే సౌత్ లో స్టార్  వెలుగు వెలుగుతున్న హీరో జీవితానికి సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారీ యాక్సిడెంట్ తో కాలు తీసేసే పరిస్థితి వచ్చినా.. 4 ఏళ్ళు వీల్ చైర్ లో మగ్గిన ఆ హీరో.. ధృఢ సంకల్పంతో కోలుకుని 23 సర్జరీలు చేయించుకుని మరీ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? 

టాలీవుడ్ లో వరుస ప్లాప్ లు.. అక్కడ మాత్రం సంచలనంగా మారిన హీరో రామ్....?

చియాన్ విక్రమ్..  సౌత్ స్టార్ హీరో.. ప్రయోగాలకు పెట్టింది పేరు. సినిమాకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడని హీరో. 6‌0 ఏళ్ళకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఈ స్టార్ సీనియర్ హీరో.. వేయని వేశం లేదు.. చేయసి పాత్ర లేదు. ఎవరికీ సాధ్య కాని సాహసోపేతమైన క్యారెక్టర్లు కూడా అవలీలగా చేసేశాడు విక్రమ్. అటువంటి విక్రమ్ జీవితంలో తీవ్ర విషాదం ఒకటి దాగి ఉంది. అప్పుడు ఆ విషాదంలో కాస్త అటుఇటు అవయితే.. ఇండియా ఓ గొప్పనటుడిని చూసి ఉండేది కాదు. ఓ మామూలు ఉద్యోగిగా మాత్రమే విక్రమ్ ఉండేవారేమో. 

బాలయ్యకు హిట్ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం డిజాస్టర్ మూవీ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

Latest Videos


విక్రమ్ ఫ్యామిలీ అంతా చదువుకున్నవారే. తండ్రి చిన్న నటుడు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. తమ్ముడు కూడా సినిమాల్లోకి వచ్చాడు. చెల్లెలు మాత్రం ప్రభుత్వ టీచర్. ఇలా ఇంట్లో అంతా మంచి వాతావరణమే ఉండేది. చవువుతున్న రోజుల్లో సినిమాల్లోకి వెళ్ళాలిఅనుకున్నాడు విక్రమ్. కాని తండ్రి మాత్రం ముందు చదువు పూర్తి చేయాలనికండీషన్ పెట్టడంతో MBA తో పాటు ఇంగ్లీష్ లిట్రేచర్ లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేశాడు విక్రమ్. ఆతరువాత సినిమాల వైపు అడుగులు వేశాడు. 

తానుచదువుకున్న చదువుకు.. నటనకు ప్రతీ దాంట్లో అవార్డ్ లు అందుకునేవారు విక్రమ్. ఈ రకంగానే ఓ అవార్డ్ అందుకుని వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విక్రమ్ కు కాలు తీసేయాలి అన్నారట. కాని అందుకు విక్రమ్ తల్లి అస్సలు ఒప్పుకోలేదట. ఎక్కడికి వెళ్లి అయినా ట్రీట్మెంట్ చేయిస్తాను కాని కాలు తీయ్యడానికి మాత్రం ఆమె నో చెప్పారట. దాంతో విక్రమ్ కెరీర్ బిగినింగ్ లోనే 4 ఏళ్ళు వీల్ చైర్ కు పరిమితం కావలసి వచ్చిందని సమాచారం. 

ఆతరువాత విక్రమ్ కాలుకు 23 సర్జరీలు చేశారట. ఆయన కాలు చీలమండలం నుంచి మోకాలువరకూ డామేజ్ అయ్యి.. చర్మం కూడా మారిపోయిందట. కాని అలాగే సర్జరీలు చేయించుకుని... సంకల్పంతో ముందుకువెళ్ళాడు విక్రమం. నాలుగైదేళ్లకుకోలుకుని మళ్ళీ రంగంలోకి దిగాడు. ఇక ఆయన ఇండస్ట్రీలో చేసిన పాత్రలు.. ప్రయోగాలు, సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..? 
 

click me!