Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం

Published : Dec 16, 2025, 10:20 AM ISTUpdated : Dec 16, 2025, 10:36 AM IST

Gunde Ninda Gudi Gantalu Today: ప్రభావతి మనోజ్ ని బాగా తిడుతుంది. ‘ నీ వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు.. కట్టుకున్న భార్యకు సుఖం లేదు’ అని ప్రభావతి అంటుంది. అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటే మనోజ్... ‘ మరి నిన్ను ఏమనాలి?’ అంటాడు  

PREV
14
Gunde Ninda Gudi Gantalu

‘ నువ్వు నన్ను కన్నది నా నుంచి వచ్చే సంపాదన కూర్చొని తినడానికా?’ అంటాడు. ఆ మాటకు ప్రభావతి గుండె ముక్కలు అవుతుంది. రోహిణి కూడా షాక్ అవుతుంది. మనోజ్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు. ‘ డబ్బులు సంపాదించి ఇస్తేనే నా వల్ల లాభం ఉంటుందా?’ అని అంటాడు. ప్రభావతి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘ ఏమైంది నీకు’ అని రోహిణీ అంటూనే ఉంటుంది. ఈ లోగా ప్రభావతి వచ్చి.. ‘ ఏమన్నావ్ రా? ఎంత మాట అన్నావ్ ? నేను లాభం కోసమే నిన్ను కన్నామా? లాభం కోసమే నిన్ను ప్రేమగా పెంచానా? లాభం కోసమే అందరి నోట మట్టి కొట్టి... నీకు లక్షలు ఇచ్చానా? లాభం కోసమే రోహిణీ వెంట పడి.. నీకు షాప్ పెట్టి ఇచ్చానా? ఎన్ని తప్పులు దాచిపెట్టాను రా? ఎన్ని పొరపాట్లు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాను రా? ఒక్కగానొక్క ఆడ పిల్లను అత్తవారింటికి వట్టి చేతులతో పంపాను కదరా? బాలుగాడు ఎన్నిసార్లు నీ తప్పులు ఎత్తి చూపుతున్నానా..నేను నీకే చేశాను కానీ.. వాడికి ఏనాడు తల్లిగా ఏదీ చేయలేదురా... రవి గాడు వాడి బతుకేదో వాడు చూసుకుంటున్నాడు. మీ నాన్నను పక్కన పెట్టి, నీ కోసం ఇవన్నీ చేస్తుంటే.. నీ నుంచి వచ్చిన సంపాదన తినడానికే నేను ఉన్నాను అంటావా? శెభాష్.. చాలా మంచి బిరుదు ఇచ్చావ్.. నిన్ను కన్నందుకు నీ భవిష్యత్తు బాగుండాలని కలలు కన్నందుకు నన్ను ఏ స్థాయికి దిగదార్చావు రా.. నాకు ఇలా కావాల్సిందే.. నిజంగానే దేవుడు ఉన్నాడు.. నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే..’ అని బాధ పడుతుంది.

24
బాలుని సవతి కొడుకులా చూశాను..

‘ అంటే..నాన్న, నువ్వు నన్ను కన్న తర్వాత ఆ బాలు గాడిని కనకుండా ఉండాల్సింది’ అని మనోజ్ నసుగుతాడు. ‘ వాడికి ఏం ఇచ్చాను రా.. బూడిద. పొద్దున్న లేస్తే సవతి కొడుకును చూసినట్లు చూసి.. నా ప్రేమ అంతా నీకే ధారపోసాను కదరా.. ఇప్పుడు ఇలా మాట్లాడున్నావ్.. నేను, మీ నాన్న మంచాన పడితే గంజి నీళ్లు అయినా పోస్తావా.. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.. డబ్బు మొత్తం ఏర్పాటు చెయ్...’ అనేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

‘ చూశావా రోహిణీ... మా అమ్మ ఎలా మాట్లాడుతుందో’ అని మనోజ్ రోహిణీకి ఫిర్యాదు చేస్తాడు. ఆమె కూడా లెఫ్ట్ రైట్ వాయిస్తుంది. ‘ నేనే మీ అమ్మను అయితే ఏం చేసేదాన్నో తెలుసా? పళ్లు రాలగొట్టేదాన్ని ఛీ...’ అనేసి వెళ్లిపోతుంది.

34
దోశల పంచాయతీ...

మరో వైపు హాలులో సుశీలమ్మ కాఫీ తాగుతూ.. సత్యం కి కూడా ఇవ్వమని అడుగుతుంది. సరే అని వెళ్తుంటే.. ప్రభావతి వచ్చి తనకు కాఫీ ఏది అని అడుగుతుంది. మళ్లీ మొదలుపెట్టింది అని సత్యం అంటాడు. అయితే... కాఫీ కూడా పెట్టుకోవడం రాదా? అందరూ మీనాని అడుగుతారేంటి? అని సుశీలమ్మ అంటుంది. అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు. ‘ మా అమ్మను కొద్ది రోజులు నీతో పాటు తీసుకెళ్లి.. వంటా వార్పు, ఓర్పు నేర్పు అన్నీ నేర్పు అని అంటాడు. దానికి సుశీల నేను ప్రశాంతంగా ఉండొద్దా అని చెప్పడం సరదాగా ఉంటుంది

ఇక.. మనోజ్ కిందకు వస్తూ... ‘ అమ్మా.. ఆకలే’ అని అంటాడు. అదేం అడగడం రా.. అడుక్కునే వాడిలా అని బాలు అనగానే.. రోహిణీ కూడా మీనా టిఫిన్ అయ్యిందా? పెట్టు అని అంటుంది. శ్రుతి కూడా నాకు ఆకలి వేస్తుంది అని చెబుతుంది.‘ తొందరగా చెయ్యవే.. అందరూ ఆకలి అంటున్నారు’ అని మీనాకి ప్రభావతి పని అప్పగిస్తుంది. కానీ... మీనా పనులు చేయకుండా సుశీలమ్మ అడ్డుకుంటుంది. ‘ఇంత మందికి అదొక్కతే ఎలా వంట చేస్తుందని.. మీరందరూ ఆడవాళ్లు కదా.. ఆ మాత్రం పనులు చేసుకోలేరా? ఎవరి భర్తకు వాళ్లే టిఫిన్ చేసిపెట్టాలని తెలీదా? అందరూ కలిసి మీనా మీద పడిపోతారేంటి?’ అని సీరియస్ అవుతుంది.

టిఫిన్ కోసం ఏం రెడీగా ఉంది అని సుశీలమ్మ అడిగితే.. దోశ పిండి ఉందని మీనా చెబుతుంది. అయితే వెంటనే.. సత్యం కోసం దోశలు వేసుకురమ్మని ప్రభావతికి చెబుతుంది. నేనా అని ప్రభావతి నసుగుతుంటే.. మీనా తాను వేస్తాను అంటుంది. అయితే బాలు మాత్రం... ‘ ఆగు మీనా.. దోశావతి దోశలు వేస్తే చూడాలని ఉంది’ అంటాడు. వెంటనే మనోజ్ మరి నాకు అంటే... రోహిణీ తో వేయించుకోమని చెబుతుంది. వెంటనే రోహిణీ నేనా అంటే... ‘ అందరూ నేనా నేనా అని మీనా మీద పడిపోతుంటే అది మాత్రం ఎంత మందికని చాకిరీ చేస్తుంది’ అని సుశీలమ్మ అనడంతో.. అందరూ ఒకే అంటారు. అయితే.. శ్రుతి దోశ పై రవి ఫన్నీ చేస్తాడు. కాసేపు ఈ దోశల గురించి డిస్కషన్ నడుస్తుంది.

44
కొత్త కారు కొనే పనిలో బాలు..

భార్యలందరూ భర్తలకు దోశలు వేయాలని.. భర్తలకు భార్యలు దోశలు వేయాలని చెబుతుంది. జంటలుగా వేయాలని చెబుతుంది. ముందుగా సత్యం, ప్రభావతులతో ఈ దోశ కార్యక్రమం మొదలౌతుంది. ఇలా ఒకరి తర్వాత మరొకరు వేస్తారు. మనోజ్ దోశలు వేయడం రాక తిప్పలు పడటం చాలా ఫన్నీగా ఉంటుంది. శ్రుతి దోశలు వేసే విధానం కూడా అందరికీ నవ్వు తెప్పిస్తుంది. తర్వాత బాలు, మీనా వంతు వస్తుంది. బాలు దోశ తిరగేస్తుంటే.. అది కాస్త మీనా కంట్లో పడుతుంది. చూసేలోగా.. పెనం మీద దోశ మాడిపోతుంది. తర్వాత మళ్లీ దోశలు వేసుకుంటారు. దోశలు వేసిన తర్వాత ఒకరికి మరొకరు తినిపించుకోవాలనే కండిషన్ పెడుతుంది. దీంతో.. అందరూ ఒకరికొకరు దోశలు తినిపించుకుంటారు. సత్యం, ప్రభావతి మాత్రమే తినిపించుకోరు.

తర్వాత కిచెన్ లో మీనా వంట చేస్తూ ఉంటుంది. బాలు వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడగతాడు. కాసేపు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. తర్వాత సెకండ్ కారు కొందాం అనుకుంటున్నాం కదా.. వెళ్లి తీసుకువస్తాను అని అంటాడు. ఈ రోజుజ మంచిదేనా అని మీనా అడిగితే... ఒకసారి మీనాని నవ్వమని... చందమామ లాంటి నీ నవ్వు చూశాక.. ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు అని అంటాడు. ఇద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. మీనా మాత్రం.. తిథులు, గడియలు చూసి తీసుకోవాలి అని మీనా అంటే సరే అని అంటాడు బాలు. మీనా సెలక్ట్ చేసిన కారును మాత్రమే తీసుకుంటాను అని బాలు అంటాడు. అత్తయ్య, మామయ్యను గుడికి తీసుకువెళ్లమని మీనా చెబితే.. సరే అని అంటాడు. కారు కొనేసి.. అందులో వాళ్లను గుడికి తీసుకువెళ్లమని చెబుతుంది. సరే అని బాలు వెళ్లిపోతాడు.

మనోజ్ తన షోరూమ్ కి వెళతాడు. దేవుడితో మాట్లాడతాడు. ‘ నేను ఏం పాపం చేశాను స్వామి.. మా ఇంట్లో అందరి కంటే ఎక్కువ చదువుకున్నాను.. నాకే ఎందుకు ఇలా అవుతోంది.. మంచిగా వ్యాపారం చేసి మంచి స్థాయికి వెళ్లాలి అనుకుంటున్నాను..’ అని దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఒక దారి చూపించు స్వామి అని మనోజ్ అనగానే ఒక వ్యక్తి వచ్చి లెటర్ ఇస్తాడు.  ఆ లెటర్ లో ఉన్న మ్యాటర్ చదవి మనోజ్ కంగారు పడతాడు.

ఈలోగా.. రోహిణీ తన ఫ్రెండ్ తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. నీకు కూడా త్వరలో సమస్య వస్తుందని వాళ్ల ఫ్రెండ్ అంటే… ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసు అని రోహిణి అంటుంది. ఇక షాప్ కి వెళ్లగానే మనోజ్ ఆ లెటర్ రోహిణీకి చూపిస్తాడు.  అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో… బాలు కొత్త కారు తీసుకొని వస్తాడు. వాళ్ల పేరెంట్స్ ని గుడికి తీసుకువెళతాడు.

Read more Photos on
click me!

Recommended Stories