'విక్రమ్' సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు కమల్. ఈ సినిమా విజయం తర్వాత గ్లోబల్ హీరో కమల్ హాసన్ నటనపైనా, నిర్మాణంపైనా దృష్టి సారిస్తూ.. అటు ఎప్పటికప్పుడు రాజకీయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2'లో నటించడం పూర్తి చేసిన కమల్ ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' సినిమాల్ నటిస్తున్నాడు.