తాగుడు, బిగ్‌ బాస్‌ గ్యాంగ్‌తో జల్సాలు.. ఆ దురలవాట్లే సూర్యకిరణ్‌ కొంపముంచాయా?.. నిర్మాత సంచలన కామెంట్స్

Published : Mar 12, 2024, 04:52 PM ISTUpdated : Mar 12, 2024, 04:57 PM IST

నటుడు, దర్శకుడు, హీరోయిన్‌ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్‌ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణంపై టాలీవుడ్‌ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.   

PREV
15
తాగుడు, బిగ్‌ బాస్‌ గ్యాంగ్‌తో జల్సాలు.. ఆ దురలవాట్లే సూర్యకిరణ్‌ కొంపముంచాయా?.. నిర్మాత సంచలన కామెంట్స్
Surya Kiran

దర్శకుడు సూర్యకిరణ్‌ బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. అనేక చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత నటుడిగా సినిమాలు చేశారు. పెద్ద స్టార్‌ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే చిరంజీవి సినిమాలు కూడా ఉన్నాయి. నటుడిగా మెప్పించడంతోపాటు దర్శకుడిగా నిరూపించుకున్నారు. `సత్యం` చిత్రం ఎంతో పెద్ద హిట్‌ అయ్యింది. సుమంత్‌కి పెద్ద హిట్‌ ఇచ్చింది. 
 

25

దీంతోపాటు మరోసారి సుమంత్‌తో చేసిన `ధన 51` మూవీ మాస్‌ హిట్‌ సాధించింది. ఇలా మంచు మనోజ్‌తో చేసిన `రాజుబాయ్‌` డిజప్పాయింట్‌ చేసింది. చివరి మూవీ కూడా ఆడలేదు. బిగ్‌ బాస్‌ 4లోనూ పాల్గొన్నాడు. ప్రారంభంలోనే ఎలిమినేట్ అయ్యాడు. దీంతో కెరీర్‌ తలక్రిందులయ్యింది. మరోవైపు హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే విడిపోయారు. ఇలా అటు కెరీర్‌ పరంగా, ఇటు ఫ్యామిలీ పరంగా సూర్య కిరణ్‌ ఫెయిల్‌ అయ్యాడు. 
 

35

దీంతో ఆయన తాగుడుకి బానిసయ్యాడట. కెరీర్‌ డౌన్‌ అయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలనేది చూడాలి, కానీ అవన్నీ వదిలేసి తాగుడి, సిగరేట్లకి, జల్సాలకు బానిసైతే జీవితం ఇలానే ఉంటుందన్నారు తెలుగు నిర్మాత చిట్టిబాబు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ, సూర్యకిరణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

45
Actor film maker Surya Kiran

ఈ మందు, సిగరేట్లు, గ్యాంగ్ లతో జల్సాలు చేయడం వల్లే జాండిస్‌(పచ్చ కామెర్లు) వచ్చాయన్నారు. ఒకప్పుడు వచ్చి తగ్గిపోయాయని, దీంతో ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కానీ అవేవీ చేయకుండా ఆయన జల్సాలు చేశాడని, బిగ్‌ బాస్‌ గ్యాంగ్‌, డ్రగ్స్ గ్యాంగ్ తోనూ బాగా సన్నిహిత్యం ఏర్పడిందన్నారు. ఇటీవల అతని స్నేహాలు కూడా ఇలాంటి దురలవాట్లని ప్రోత్సహించేవిగా ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా బిగ్‌ బాస్‌ ఫ్రెండ్స్ తోనూ తిరిగేవాడన్నారు. వారి కారణంగా ఈ దురలవాట్లు పెరిగాయని, అది అరోగ్యంపై అజాగ్రత్త పెరిగిందన్నారు.
 

55
Surya Kiran

ఇంట్లో చెప్పే వాళ్లు లేరని, చెప్పినా ఆయన వినే రకం కాదని, ఎవరి సలహాలు పాటించడని, చాలా సార్లు ఇలాంటివి చెప్పడం జరిగిందని, కానీ ఎప్పుడూ వినలేదని, ఎవరూ చెప్పినా అతను వినడని వెల్లడించారు. ఇలా తాగుడు అలవాట్లతో ఆయనకు తగ్గిపోయిన జాండస్‌ మళ్లీ తిరగబడిందని, దాని చూసుకోకపోవడంతోనే ఆయన ప్రాణాల మీదకు వచ్చిందన్నారు చిట్టిబాబు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories