షూటింగ్ అయిపోయాక శ్రీముఖి ఏం చేస్తుంది? సెట్స్ లో అలా... ఆఫ్ స్క్రీన్ లో ఇలా! సింగర్ శ్వేత చెప్పిన నిజాలు!

Published : Mar 12, 2024, 04:45 PM IST

 యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఎవరికీ తెలియదు. షూటింగ్ అయ్యాక శ్రీముఖి ఏం చేస్తుందో సింగర్ శ్వేత మోహన్ వెల్లడించారు.   

PREV
16
షూటింగ్ అయిపోయాక శ్రీముఖి ఏం చేస్తుంది? సెట్స్ లో అలా... ఆఫ్ స్క్రీన్ లో ఇలా! సింగర్ శ్వేత చెప్పిన నిజాలు!
Sreemukhi


శ్రీముఖి అనతికాలంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. బుల్లితెరపై ఆమెదే హవా. షోల పరంగా సుమ కనకాల, రష్మీ గౌతమ్ లను కూడా వెనక్కి నెట్టింది. ముఖ్యంగా స్టార్ మా లో హంగామా మొత్తం శ్రీముఖిదే. సూపర్ సింగర్ రియాలిటీ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 


 

26

సూపర్ సింగర్ షోకి శ్వేత మోహన్, మంగ్లీ, అనంత్ శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి గురించి శ్వేతా మోహన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెట్స్ లో శ్రీముఖి ఎలా ఉంటుంది. షూటింగ్ అయ్యాక ఏం చేస్తుంది. ఆమెతో తన బాండింగ్ ఏమిటో చెప్పుకొచ్చింది. 

36

శ్వేత మోహన్ మాట్లాడుతూ... నేను డ్రెస్ అప్ అయ్యి వెళ్లే సరికే శ్రీముఖి షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. షూటింగ్ అయిన వెంటనే వెళ్ళిపోతుంది. అందుకే ఆమెతో నాకు ఇంకా పెద్దగా బాండింగ్ ఏర్పడలేదు. షోలో భాగంగా సెట్స్ లో మేము మాట్లాడుకుంటాం. వ్యక్తిగత బాండింగ్ అయితే లేదు. 


 

46

నేను శ్రీముఖి అభిమానిని. ఆమె ఎనర్జీ, పెర్సనాలిటీ నాకు చాలా నచ్చాయి. ఆమె సెట్స్ లో ప్రేమను పంచుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుందని... అన్నారు. కాబట్టి షూటింగ్ అయిన వెంటనే శ్రీముఖి అక్కడ నుండి చెక్కేస్తోంది. అందుకు ఆమె బిజీ యాంకర్ అండ్ యాక్టర్ కావడం. మరొక షూటింగ్ కోసం శ్రీముఖి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. 

56
Sreemukhi

ఇక శ్రీముఖి నటిగా కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది భోళా శంకర్ చిత్రంలో ఆమె ఒక రొమాంటిక్ రోల్ చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీలోని నడుము చూసే సన్నివేశాన్ని చిరంజీవి-శ్రీముఖి స్పూఫ్ చేశారు. ఈ సీన్ అంతగా పండలేదు. 

 

66


శ్రీముఖి పలు చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది. క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేయడం విశేషం. లీడ్ హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటున్నట్లు సమాచారం. శ్రీముఖి ఫ్యాన్స్ ఆమె సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories