అసలు గేమ్‌ స్టార్ట్ చేసిన రాజమౌళి.. మహేష్‌ బాబు సినిమాలో స్టార్‌ హీరో? ముహూర్తం ఫిక్స్

Published : Jul 03, 2024, 10:51 AM IST

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాకి సంబంధించిన బిగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. సినిమాలో నటించే ఆర్టిస్ట్ లతోపాటు మూవీ ప్రారంభానికి సంబంధించిన గూస్‌ బంమ్స్ తెప్పించే వార్త వినిపిస్తుంది.   

PREV
16
అసలు గేమ్‌ స్టార్ట్ చేసిన రాజమౌళి.. మహేష్‌ బాబు సినిమాలో స్టార్‌ హీరో? ముహూర్తం ఫిక్స్

తెలుగులో వస్తోన్న భారీ సినిమా `కల్కి 2898 ఏడీ` విడుదలైంది. కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు మరో సంచలన మూవీ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియన్‌ సినిమాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతుంది.  అంతర్జాతీయ ప్రమాణాలతో, గ్లోబల్‌ ఫిల్మ్ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఆ స్థాయిలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉండబోతున్నారట. 

26

జంగిల్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ప్రస్తుతం తీసిన `కల్కి` సుమారు 600కోట్లతో తెరకెక్కించారు. అంటే మహేష్‌ బాబు సినిమా ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 
 

36

ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ల టీమ్‌ ఆల్‌ రెడీ సెట్‌ అయ్యిందట. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణి ఫైనల్‌ అని తెలుస్తుంది. అలాగే మ్యూజిక్‌ పరంగా అంతర్జాతీయ టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందట. మరోవైపు సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని,  మరోవైపు వీఎఫ్‌ఎక్స్ కమల్‌ కన్నన్‌ లను ఎంపిక చేసినట్టు సమాచారం. 

46
Prithviraj

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమాలో నటించే ఆర్టిస్టులు ఎవరు? టెక్నీషియన్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. ఇందులో భారీ కాస్టింగ్‌ ఉండబోతుందనే ప్రచారం మొదట్నుంచి జరిగింది. తాజాగా ఇందులో కీలక పాత్ర కోసం మలయాళ స్టార్‌ హీరో, `సలార్‌` నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పేరు వినిపిస్తుంది. సినిమాలో మహేష్‌ బాబు తలపడేది ఆయనతోనే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

56

వీరితోపాటు ఇందులో ఇతర భాషలకు సంబంధించిన నటులు కూడా ఉండబోతున్నారట. హిందీ, తమిళం నుంచి కూడా పేరున్న ఆర్టిస్ట్ లను, అలాగే ఇంటర్నేషనల్‌ గా పేరున్న ఆర్టిస్ల్ లను కూడా తీసుకురాబోతున్నారట రాజమౌళి. బాలీవుడ్‌ నుంచి హృతిక్‌ గెస్ట్ రోల్‌ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అలాగే ఇండోనేషియన్‌ నటి చెల్సియాని హీరోయిన్‌గా అనుకున్నారట. వీటిపై ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. 
 

66
Mahesh Babu and Rajamouli

మరోవైపు ఈ సినిమాకి టైటిల్స్ కూడా ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. `మహారాజా`, `చక్రవర్తి` అనే టైటిల్స్ అనుకున్నారనే రూమర్స్ వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక సినిమా ప్రారంభానికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. మహేష్‌, రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఆగస్ట్ లోనే ప్రారంభం కాబోతుందట. ఈ విషయాన్ని మహేష్‌ బాబు బాబాయ్‌ ఆదిశేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారీ స్థాయిలో ఉంటుందని, మంచి ప్రాజెక్ట్ అవుతుందని, ఆగస్ట్ లో ప్రారంభమవుతుందని, సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని ఆయన తెలిపారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories