మోక్షజ్ఞను వాళ్ళు తొక్కేస్తారా, ఎన్టీఆర్ తో పోలికలే అసలు ఛాలెంజ్... బాలయ్య వారసుడికి అంత ఈజీ కాదు!

First Published Jul 3, 2024, 9:47 AM IST

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే మోక్షజ్ఞ హీరోగా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఓ వర్గం తొక్కేయడానికి సిద్ధంగా ఉంది. మోక్షజ్ఞ ముందున్న సవాళ్లు ఏమిటో చూద్దాం.. 
 

వారసులకు హీరో కావడం చాలా సులభం. అవుట్ సైడర్స్ మాదిరి ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనుండదు. ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేరుగా ఓ స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ గా లాంచ్ కావచ్చు. అదే సమయంలో సవాళ్లు కూడా ఉంటాయి. 
 

Balakrishna

ఓ స్టార్ హీరో కొడుకు అనగానే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉంటాయి. అవి అందుకోగలగాలి. వారసత్వం అదృష్టంతో పాటు బాధ్యత కూడాను. డాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, లుక్స్.. ఇలా ప్రతి విషయంలో పోలికలు మొదలవుతాయి. ఏ మాత్రం తడబడినా, ఎక్కడ తగ్గినా ట్రోల్స్ తప్పవు. అందులోనూ ఇది సోషల్ మీడియా యుగం. వెంటనే ఫీడ్ బ్యాక్ వచ్చేస్తుంది. 
 

Balakrishna

ఎన్టీఆర్ నటవారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ సత్తా చాటాడు. బాలయ్య డైలాగ్స్ కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. మాస్ యాక్షన్ హీరోగా బాలకృష్ణ అశేష అభిమాన వర్గాన్ని సంపాదించాడు. టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన వారసుడిగా మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయనున్నాడని విశ్వసనీయ సమాచారం.
 

మోక్షజ్ఞ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నటుడిగా అన్ని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డం, కెరీర్ ఉంటుంది. ఎంతటి వారసత్వం, అభిమాన గణం ఉన్నా.... కొంత కాలం మాత్రమే నెట్టుకు రాగలడు. టాలెంట్ నిరూపించుకున్న నాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జెండా పాతుతాడు. లుక్ పరంగా మోక్షజ్ఞ పర్లేదు. మరి నటన, డాన్సులు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాల్సి ఉంది. 

మరోవైపు మోక్షజ్ఞను తొక్కేసేందుకు యాంటీ ఫ్యాన్ వర్గం రెడీగా ఉంది. ఇది ప్రత్యేకంగా, ప్రణాళిక బద్దంగా పని చేసే వ్యవస్థ కాదు. నందమూరి హీరో అంటే మెగా హీరోల అభిమానులు ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెగా హీరోలది అతిపెద్ద సోషల్ మీడియా వ్యవస్థ. నాన్ మెగా హీరో అంటే ట్రోల్ చేయడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అసలు వెనకాడరు. 
 

ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ నుండి కూడా మోక్షజ్ఞ నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం మోక్షజ్ఞకు వ్యతిరేకం. కొన్నేళ్లుగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం యాంటీ బాలయ్యగా తయారయ్యారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ నటన, డాన్సులు, డైలాగ్స్ ని విమర్శించే అవకాశం లేకపోలేదు. 
 

Balakrishna

మొదటి సినిమాకు చాలా మంది హీరోలు నెగిటివిటీ ఫేస్ చేశారు. మోక్షజ్ఞకు కూడా ఎంతో కొంత మేర ఎదుర్కొన తప్పదు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞను నెత్తిన పెట్టుకొనే అభిమాన గణం ఉంది. నాలుగైదు సినిమాల వరకు ఢోకా లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా మోక్షజ్ఞ కెరీర్ సాగవచ్చు. తన మార్క్ చూపించి మోక్షజ్ఞ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నప్పుడే స్టార్ అవుతాడు. 
 

జూనియర్ ఎన్టీఆర్ అత్యంత నెగివిటీ, వ్యతిరేకత ఫేస్ చేశారు. ఆయన్ని తొక్కేయాలని నందమూరి కుటుంబమే కుట్రలు పన్నిందనే వాదన ఉంది. అవన్నీ ఎన్టీఆర్ ని స్టార్ కాకుండా ఆపలేకపోయాయి. అందుకు కారణం ఎన్టీఆర్ మంచి నటుడు, గొప్ప డాన్సర్. మల్టీ టాలెంటెడ్ ఫెలో. ఎన్టీఆర్ తో పోలికలు మోక్షజ్ఞకు అసలైన ఛాలెంజ్..     

Latest Videos

click me!