ఎన్టీఆర్ ను ముఖం మీదే చెడామడా తిట్టిన స్టార్ డైరెక్టర్, తారక్ తల్లి ఏం చేసిందో తెలుసా?

Published : Jan 28, 2026, 11:46 AM IST

పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనతో డైరెక్టర్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వారికి తారక్ బాగా రెస్పెక్ట్ కూడా ఇస్తాడు. కాని ఓ స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తల్లి ముందే చెడామడా తిట్టేశాడట. కారణం ఏంటో తెలుసా?

PREV
15
పాన్ ఇండియా స్టార్ గా..

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలో దూకుడు చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ హీరోగా మారిన తారక్.. దేవర సినిమాతో.. పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమాతో రాబోతున్నాడు తారక్. ఈమూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేశాడు. ఈ సినిమా తారక్ లో కొత్త కోణాని బయటకు తీయ్యబోతోంది. అందుకోసం ఆయన లుక్ ను కూడా కంప్లీట్ గా మార్చేసుకున్నాడు.

25
సినిమా కోసం ఎంత రిస్క్ అయినా రెడీ..

సినిమా అద్భుతంగా రావాలని ఎంత కష్టం అయినా భరిస్తాడు ఎన్టీఆర్. ఎంత కష్టమైన షాట్ అయినా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చేయడానికి రెడీగా ఉంటాడు. ఏ రిస్క్ చేయడానికి అయినా వెనకాడడు. సినిమా కుటుంబంలోనే పుట్టి పెరిగిన ఎన్టీఆర్.. డాన్స్ నేర్చుకుని.. దాన్ని తన కెరీర్ కు కీలకంగా మార్చుకున్నాడు. 

సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు తారక్. నందమూరి లెగసీని కాపాడుతూనే.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. హీరోగా చాలాచిన్న వయసులో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. అంతకు మందు చైల్డ్ ఆర్టిస్గ్ గా కొన్ని సినిమాల్లో నటించాడు.

35
ఎన్టీఆర్ ను తిట్టిన స్టార్ డైరెక్టర్

ఒక సినిమా విషయంలో స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ ను చెడా మడా తిట్టాడు. అంత పెద్ద స్టార్ హీరోను ఒక డైరెక్టర్ తిట్టడం ఏంటీ..అంటే.. ఎన్టీఆర్ అప్పటికి స్టార్ హీరో కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. చిన్న పిల్లడు అయిన తారక్.. బాలరామాయణం సినిమాలో రాముడి పాత్రలో నటించాడు. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ అదరిపోయింది. అయితే చిన్నతనం కావడంతో ఎన్టీఆర్ చాలా అల్లరి చేసేవారట. సెట్ లో పిల్లలో కలిసి సీన్లు ప్రాక్టీస్ చేస్తూనే.. గోల గోల చేసేవాడట. ఒక చోట కుదురుగా ఉండేవాడు కాదట.

45
సెట్ డ్యామేజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

బాల రామాయణం సినిమా షూటింగ్ టైమ్ లో .. రాముడి కోసం ప్రత్యేకంగా విల్లు బాణాలు తయారు చేయించాడు గుణశేఖర్. ప్రాక్టీస్ కోసం ఎన్టీఆర్ కు అవి చేతికి ఇచ్చారు. వాటిని తీసుకుని.. అక్కడ పిల్లలతో కలిసి.. డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ.. యాక్షన్ సీన్ చేయడం స్టార్ట్ చేశాడట తారక్. దాంతో ఆ విల్లు విరిగిపోయింది. షూటింగ్ ఆపేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. 

అన్నిరోజులుగా పిల్లలో చాలా ఇబ్బందిపడుతూనే షూటింగ్ చేస్తున్న గుణశేఖర్ కు కోపం గట్టిగా వచ్చేసింది. వెంటనే ఆయన ఎన్టీఆర్ ను పట్టుకుని చెడామడా తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్కడ ఎన్టీఆర్ తల్లి కూడా ఉన్నారు. తారక్ ను తిడుతుంటే ఆమె ఏమన్నారన్న విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుణ శేఖర్ వెల్లడించారు.

55
ఎన్టీఆర్ ను గొప్పగా పెంచిన వ్యక్తి..

గుణశేఖర్ మాట్లాడుతూ.. '' తారక్ బాగా అల్లరి చేసేవాడు.. సెట్ లో విల్లు విరిచేస్తే.. అల్లరి తట్టుకోలేక గట్టిగా పట్టుకుని తిట్టేశాను. ఆతిట్లకు కు బెదిరిపోయి తారక్ వెళ్లి.. వాళ్ల అమ్మను గట్టిగా పట్టుకున్నాడు. ఏ అమ్మ అయినా.. వెంటనే మా బాబును ఎందుకు తిడుతున్నాడు.. వాడు చిన్నవాడు, మీరు చెప్పినట్టు నటిస్తున్నాడు కదా.. అని అంటారు. కానీ ఆమె ఆ మాట అనలేదు. నువ్వు డైరెక్టర్ గారిని చిరాకు పెట్టావు. తప్పుకదా.. ఆయనకు ఎంత పని ఉంటుంది. అని తారక్ కు నచ్చ చెప్పింది. నిజంగా ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండటానికి ఆమె పెంపకమే కారణం. తారక్ ను అద్భుతంగా పెంచారు వాళ్ల అమ్మ. మంచి పద్దతులు నేర్పించారు.'' అని గుణశేఖర్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories