అఖిల్‌ సినిమాతో కోట్లు నష్టపోయిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతుందంటూ ఆవేదన

Published : May 11, 2025, 07:10 PM IST

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయం అయిన `అఖిల్‌` సినిమా ఫ్లాప్‌పై దర్శకుడు వివి వినాయక్‌ స్పందించారు. పరాజయానికి కారణాలు తెలిపారు. మరో షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు.   

PREV
15
అఖిల్‌ సినిమాతో కోట్లు నష్టపోయిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతుందంటూ ఆవేదన
akhil akkineni

అక్కినేని కుర్ర హీరో అఖిల్‌ ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేశాడు. ఆరూ భారీ చిత్రాలే కావడం విశేషం. అయినా ఆయన కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చే మూవీ ఒక్కటి కూడా పడలేదు. ప్రస్తుతం `లెనిన్‌` మూవీతో రాబోతున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో లవ్‌ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 
 

25
akhil movie

ఇదిలా ఉంటే అఖిల్‌ కి సంబంధించిన ఒక ఆసక్తికర, షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ `అఖిల్‌` సినిమా గురించి షాకింగ్‌ విషయాలను వెల్లడించారు.

అఖిల్‌.. హీరోగా `అఖిల్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో యాక్షన్‌ ఫాంటసీగా ఈ చిత్రం తెరకెక్కింది. అఖిల్‌ సరసన సాయేషా హీరోయిన్‌గా నటించింది. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. 
 

35
aKHIL AKKINENI

ఆ విషయాన్ని దర్శకుడు వినాయక్‌ ఒప్పుకున్నారు. ఈ మూవీతో బాగా నష్టపోయినట్టు తెలిపారు. సినిమా భారీ హైప్‌తో వచ్చింది, కానీ ఫలితం తేడా కొట్టింది. ఈ క్రమంలో కొంత మంది బయ్యర్లకి తానే మనీ సెటిల్‌ చేయాల్సి వచ్చిందట.

చాలా పెద్ద అమౌంట్‌ని ఒక పెద్ద మనిషిని పెట్టి బయ్యర్లకి బ్యాక్‌ చేశానని తెలిపారు వినాయక్‌. ఆయన చెప్పినదాని ప్రకారం అది కోట్లల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఒక డైరెక్టర్‌ మనీ బ్యాక్‌ చేశాడంటే అది ఆయనకు పెద్ద లాస్‌ అనే చెప్పాలి.  

45
akhil akkineni

అయితే ఇప్పటికీ అఖిల్‌ విషయంలో తనకు బాధగానే ఉందని, ఎంతో ఇష్టపడి, లవ్‌ చేసి తనతో సినిమా చేసిన అఖిల్‌కి హిట్‌ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందని, ప్రతి రోజూ బాధపడతానని తెలిపారు వినాయక్‌. అయినా అఖిల్‌తో మంచి ర్యాపో ఉందని, మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు స్టార్‌ డైరెక్టర్‌. 
 

55
v v vinayak (suman tv)

`అఖిల్‌` సినిమా ఫ్లాప్‌కి కారణాలు చెబుతూ, ఆ కథ అఖిల్‌కి పెద్దదైపోయిందని తెలిపారు. తను మోయగలిగినంత కాకుండా ఎక్కువ బరువు పెట్టామని, అత్యాశకుపోయామని అన్నారు. కథ సమస్య,

పైగా సీజీ కూడా కంప్లీట్‌ కాక ఇబ్బంది పడ్డామని, చివరికి రిలీజ్‌ టైమ్‌కి సినిమాని కూడా చూసుకోలేకపోయామని తెలిపారు. కానీ ఎప్పటికైనా అఖిల్‌ పెద్ద సూపర్‌ స్టార్‌ అవుతాడని తెలిపారు వినాయక్‌. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories