`బిగ్‌ బాస్‌ తెలుగు 7` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు చేసే పని ఇదే.. ఆ దెబ్బ గట్టిగానే పడిందిగా

Published : May 11, 2025, 05:18 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సెలబ్రిటీ కావాల్సిన రైతు బిడ్డ ఆ దెబ్బతో చివరకు మళ్లీ అదే పని చేసుకోవాల్సి వచ్చిందా?  

PREV
16
`బిగ్‌ బాస్‌ తెలుగు 7` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు చేసే పని ఇదే.. ఆ దెబ్బ గట్టిగానే పడిందిగా
pallavi prashanth

బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోస్‌కి మన వద్ద మంచి ఆదరణనే లభిస్తుంది. మొదటి రెండు సీజన్లు బాగానే ఆకట్టుకున్నాయి. నాల్గో సీజన్‌ సక్సెస్‌ అయ్యింది. మళ్లీ ఏడో సీజన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది.

ఎనిమిదో సీజన్‌ పెద్దగా అలరించలేకపోయింది. ఈ క్రమంలో ఏడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వివాదాలతో పాపులర్‌ అయిన ఆయన సెలబ్రిటీగా రాణిస్తున్నాడా? అనేది చూస్తే. 

26
pallavi prashanth (instagram )

రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్‌. తగ్గేదెలే అంటూ పుష్ప మ్యానరిజంతో మెప్పించాడు. గేమ్స్ లో, టాస్క్ ల్లో, నామినేషన్లలో తనదైన స్టయిల్‌లో రచ్చ చేశాడు. అటు బిగ్‌ బాస్‌ షోకి కంటెంట్‌ ఇవ్వడంతోపాటు ఆడియెన్స్ ని అలరించారు. షోపై ఆసక్తి క్రియేట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. 
 

36
pallavi prashanth (instagram )

అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. శివాజీ వంటి బలమైన కంటెస్టెంట్‌ని కూడా కాదని పల్లవి ప్రశాంత్‌ని విన్నర్‌ చేయడం విశేషం. ఇది అప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

అంతేకాదు గ్రాండ్‌ ఫినాలే రోజు ఆయన చేసిన పని పెద్ద రచ్చ అయ్యింది. ఫ్యాన్స్ గొడవ చేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. కొన్ని రోజులపాటు జైల్లోనూ ఉండాల్సి వచ్చింది పల్లవి ప్రశాంత్‌కి. 
 

46
pallavi prashanth (instagram )

బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌గా నిలిచిన ఆనందం కూడా లేకుండా పోయింది. దానికి ఆయన అత్యుత్సాహమే కారణమని అంతా అంటారు. ఇది తన కెరీర్‌పై కూడా ప్రభావం పడింది.

గతంలో చాలా మంది విన్నర్స్ కి షో తర్వాత మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. సెలబ్రిటీలుగా మారిపోయారు. కానీ పల్లవి ప్రశాంత్‌ కి లైఫ్‌ రివర్స్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ తన పని తానే చేసుకునే పరిస్థితి నెలకొంది. 
 

56
pallavi prashanth (instagram )

పల్లవి ప్రశాంత్‌తో సినిమాలు చేయబోతున్నారనే టాక్‌ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. ఇప్పుడు ఆయన తన పొలంలోనే పనులు చేసుకుంటూ కనిపించాడు. సోషల్‌ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ, తన వ్యవసాయం పనులకు సంబంధించిన వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు.

అడపాదడపా చిన్న చిన్న షాప్‌ ఓపెనింగ్స్ లోనూ పాల్గొన్నాడు. ఇప్పుడు అవి కూడా లేవు. సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఈవెంట్లలో సందడి చేస్తూ, తన వ్యవసాయం చూసుకుంటూ రాణిస్తున్నారు పల్లవి ప్రశాంత్‌. బిగ్‌ బాస్‌ తర్వాత ఆయన ఆర్థికంగా బెటర్‌ అయ్యారు కానీ, కెరీర్‌ పరంగా బెటర్‌ కాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. 
 

66
pallavi prashanth (instagram )

అంతేకాదు ఇటీవల బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్ లోనూ ఆయన పేరు వినిపించింది. పలు బెట్టింగ్‌ యాప్స్ ని ఆయన ప్రమోట్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో మరింతగా విమర్శలపాలయ్యారు పల్లవి ప్రశాంత్‌.

ఇప్పుడు అన్నీ వదిలేసి ఫ్యామిలీకే పరిమితమయినట్టు సమాచారం. అన్నట్టు ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి ఆగస్ట్ లోనే షోని ప్రారంభించే అవకాశాలున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories