అజయ్ దేవగణ్ vs అక్షయ్ కుమార్: ఎవరి ఆస్తులు ఎక్కువ? హిట్స్, ఫ్లాప్స్ లెక్కలు
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ సినిమాలు, సంపద, కెరీర్ పోలిక. బాక్సాఫీస్ వద్ద నిజమైన బాద్షా ఎవరు? ఇలాంటి క్రేజీ విషయాలను ఇందులో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ సినిమాలు, సంపద, కెరీర్ పోలిక. బాక్సాఫీస్ వద్ద నిజమైన బాద్షా ఎవరు? ఇలాంటి క్రేజీ విషయాలను ఇందులో తెలుసుకుందాం.
అజయ్ దేవగణ్ vs అక్షయ్ కుమార్: ఇద్దరూ బాలీవుడ్ టాప్ హీరోలు. అద్భుత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. వీరి హిట్ సినిమాలు, సంపద ఇక్కడ చూద్దాం.
కెరీర్: అజయ్ 1991లో `ఫూల్ ఔర్ కాంటే`తో ఎంట్రీ ఇచ్చారు. సూపర్ హిట్. అక్షయ్ కూడా అదే ఏడాది `సౌగంధ్` తో వచ్చారు.
34 ఏళ్లలో అజయ్ 94+ సినిమాలు చేశారు. కెరీర్ లో హిట్స్, ఫ్లాప్స్ చూసారు. సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగానే ఉన్నా, సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువగానే ఉంది.
అజయ్ హిట్ సినిమాలు: ఫూల్ ఔర్ కాంటే, జిగర్, సింగం, గోల్‌మాల్ అగైన్, తానాజీ, దృశ్యం 2, రైడ్ 2 వంటి చిత్రాలతో అలరించారు.
అజయ్ కెరీర్ లో 20+ హిట్స్, 44 ఫ్లాప్స్, మిగిలినవి యావరేజ్. ఆయన సినిమాలు చాలా వరకు వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన మూవీస్ ఉండటం విశేషం.
అజయ్ సంపద ₹427 కోట్లు. రియల్ ఎస్టేట్, VFX, ఆటోమొబైల్స్ లో పెట్టుబడులు. ముంబయిలో లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. లగ్జరీ కార్లు మెయింటేన్ చేస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్ కాజోల్ అనే విషయం తెలిసిందే.
ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే.. అక్షయ్ కూడా 1991లో `సౌగంధ్` తో ఎంట్రీ ఇచ్చారు. 'ఖిలాడి' సినిమాతో స్టార్ అయ్యారు. బాలీవుడ్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నారు.
అక్షయ్ కుమార్ క్రమశిక్షణకు పెట్టింది పేరు. రాత్రి 9-10కి పడుకుని, 4కి లేచి వ్యాయామం చేస్తారు. ఉదయం వరకు తన రెగ్యూలర్ పనిలోకి వెళ్లిపోతారు. షూటింగ్‌లు ఉంటే అందరి కంటే ముందే ఆయన సెట్‌లో ఉంటారట.
అక్షయ్ యాక్షన్, కామెడీ, డ్రామా, సామాజిక సినిమాలు చేస్తారు. 34+ ఏళ్లలో 150+ సినిమాలు. యాక్షన్, కామెడీ సినిమాలు ఆయనకు మంచి పేరుని, సక్సెస్‌ని తీసుకొచ్చాయి.
కెరీర్: అక్షయ్ ఖిలాడి, మొహ్రా, హేరా ఫెరీ, సింగ్ ఈజ్ కింగ్, హౌస్‌ఫుల్ 2, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, సూర్యవంశీ వంటి హిట్ సినిమాలు చేశారు.
అక్షయ్ 50+ హిట్ సినిమాలు చేశారు. 19 సినిమాలు బంపర్ ఓపెనింగ్స్ సాధించాయి. మిగిలిన చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. కానీ ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ఆయనే ఒక మినీ ఇండస్ట్రీగా నిలిచారు.
అక్షయ్ ఒక్కో సినిమాకు ₹72-100 కోట్లు తీసుకుంటారు. ఆయన సంపద ₹742 కోట్లు. ఈ లెక్కన అజయ్ దేవగన్‌తో పోల్చితే అక్షయ్ సంపన్నుడు.
అజయ్ సంపద ₹427 కోట్లు, అక్షయ్ ది ₹742 కోట్లు. ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టినా, సంపదలో ₹315 కోట్ల తేడా. అక్షయ్ జోరు వేరే లెవల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు మినిమమ్ వంద కోట్లు చేసినా ఆయన సినిమాలు ఇప్పుడు మాత్రం కనీసం యాభై కోట్లని కూడా టచ్ చేయలేకపోవడం గమనార్హం.