చిరంజీవి పిలిచి ఆఫర్‌ ఇస్తే నో చెప్పిన డైరెక్టర్‌, కట్‌ చేస్తే ఇద్దరి కాంబినేషన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌

Published : Feb 09, 2025, 05:42 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి పిలిచిన ఆఫర్‌ ఇస్తే ఏ దర్శకుడైనా నో చెప్పరు. ఛాన్స్ ఇవ్వడమే గొప్పగా భావిస్తారు. ఎగిరి గంతేస్తారు. కానీ ఓ డైరెక్టర్‌ మాత్రం నో చెప్పాడట.   

PREV
15
చిరంజీవి పిలిచి ఆఫర్‌ ఇస్తే నో చెప్పిన డైరెక్టర్‌, కట్‌ చేస్తే ఇద్దరి కాంబినేషన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌
megastar chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో విజయాలున్నాయి. బ్లాక్‌ బస్టర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిన మూవీ `వాల్తేర్‌ వీరయ్య`. చిరంజీవి కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ ఇది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.230కోట్లు వసూలు చేసింది. దీనికి దర్శకుడు బాబీ దర్శకత్వం వహించడం విశేషం. 
 

25
Chiranjeevi

ఈ మూవీకి ముందు చిరంజీవితో దర్శకుడు బాబీ సినిమాల చేయాల్సి ఉంది. మెగాస్టార్‌ చిరంజీవినే ఈ ఆఫర్‌ ఇచ్చారు. పిలిచి మరీ ఆయన ఈ ఛాన్స్ ఇచ్చారు. కానీ బాబీ నో చెప్పాడట. తాను చేయలేను సార్‌ అని భయపడుతూనే చెప్పాడట. దాన్ని చిరు కూడా అంతే పాజిటివ్‌గా తీసుకున్నాడట. కానీ అనంతరమే `వాల్తేర్‌ వీరయ్య` మూవీ సెట్‌ అయ్యింది. మరి ఈ కథేంటో చూస్తే. 

35
Chiranjeevi

చిరంజీవి మలయాళ హిట్‌ మూవీ `లూసీఫర్‌`ని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. `గాడ్‌ ఫాదర్‌` గా ఈ మూవీ రూపొందింది. దీనికి మోహన్‌ రాజా దర్శకత్వం వహించారు. అయితే ఆయనకంటే ముందు ఈ స్క్రిప్ట్ చాలా మంది దర్శకుల వద్దకు వెళ్లింది. చాలా మంది వర్క్ చేశారు. వారిలో బాబీతోపాటు, సుజీత్‌ వంటి వారి పేర్లు వినిపించాయట. బాబీకి స్క్రిప్ట్ ఇచ్చి ఈ మూవీ రీమేక్‌ చేయాలని చెప్పాడట చిరు. కానీ సినిమా చూసి, స్క్రిప్ట్ చదివాక తాను దీన్ని రీమేక్‌ చేయలేనని తెలిపారట. 

45
bobby

కానీ తన సొంత కథ కాకుండా సినిమా చేస్తే అది ఆడదు అని `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌` విషయంలో నిరూపితమైంది. తాను వేరే వాళ్ల కథలను ఓన్‌ చేసుకోలేకపోతున్నానని, తాను చిన్నప్పట్నుంచి చూసిన చిరంజీవి వేరు, తాను ఒకలా చూపించాలనుకుంటున్నానని, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాటిట్యూడ్‌ అది వేరే అని చెప్పాడట బాబీ. ఫైనల్‌గా `లూసీఫర్‌` రీమేక్‌ చేయనని చెప్పేశాడు. 
 

55
Chiranjeevi

దీంతో కూల్‌గానే డీల్‌ చేసిన చిరు, ఆ తర్వాత నువ్వు ఎలా చూపించాలనుకుంటున్నావ్‌? నువ్వు చూసిన చిరంజీవి ఏంటో చెప్పు అని అడగడంతో `వాల్తేర్‌ వీరయ్య` కథ చెప్పాడట. అది కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిపోయిందని, తాను కథ రెడీ చేసుకుని చిరంజీవికి చెప్పడం, ఆయన ఓకే చేయడంతో సినిమా వర్కౌట్‌ అయ్యింది.

ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా, 2013 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్న చిరంజీవి నెక్ట్స్ అనిల్‌ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. అలాగే శ్రీకాంత్‌ ఓడెలతో ఓ మూవీ చేయాల్సి ఉంది. దీంతోపాటు బాబీతో మరోసారి కలిసి మూవీ చేయబోతున్నారు. 

read  more: Marriage Condition: సినిమా ప్లాప్‌ అయితే పెళ్లి, అక్షయ్‌ కుమార్‌ మ్యారేజ్‌ వెనుక ట్వింకిల్‌ ఖన్నా కండీషన్‌

also read: `స్పిరిట్‌` విషయంలో సందీప్‌ రెడ్డి వంగా కండీషన్‌, ప్రభాస్‌ అయినా సరే ఆ రూల్‌ పాటించాల్సిందేనా?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories