Kanchana 4: కాంచన 4 షూటింగ్ మొదలుపెట్టిన రాఘవ లారెన్స్

Published : Feb 09, 2025, 05:41 PM IST

Raghava Lawrence Begins Kanchana 4: రాఘవ లారెన్స్ వరుసగా చేస్తూ వస్తున్న కాంచన సిరీస్ లో 4వ సినిమా స్టార్ట్ అయ్యింది. స్వీయ దర్శకత్వంలో.. రాఘవ లారెన్స్  హీరోగా నటిస్తున్న కాంచన 4 సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభమైంది.  

PREV
14
Kanchana 4:  కాంచన 4 షూటింగ్ మొదలుపెట్టిన రాఘవ లారెన్స్
కాంచన 4 బడ్జెట్

Raghava Lawrence Begins Kanchana 4 : సౌత్ సినిమాలో హీరోలుగా, దర్శకులుగా రెండు పాత్రలు పోషిస్టూ.. హరర్ సినిమాలు తీయ్యడంలో  సుందర్ సి, రాఘవ లారెన్స్ కీ ప్రముఖ పాత్ర ఉంది. ఇద్దరూ హారర్ సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 సినిమాలతో హిట్లు కొట్టారు. అలాగే సుందర్ సి కూడా అరణ్మనై సిరీస్ తో హిట్లు కొట్టారు.

Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?

24
కాంచన 4 షూటింగ్

సుందర్ సి అరణ్మనై 4 సినిమాతో హిట్ కొట్టగా, రాఘవ లారెన్స్ కాంచన 4 ని మొదలుపెట్టారు. హారర్, థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఉండటంతో ఇద్దరూ ఆ జానర్ పై దృష్టి పెట్టారు. కాంచన 3 క్లైమాక్స్ లో కాంచన 4 వస్తుందని చెప్పారు.

Also Read:  చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?


 

34
కాంచన 4 షూటింగ్ మొదలు

కాంచన 3 విడుదలై 6 ఏళ్ళు అవుతుండగా, కాంచన 4 షూటింగ్ తాజాగా మొదలైంది. పొల్లాచ్చిలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ తో పాటు పూజా హెగ్డే, నోరా ఫతేహి నటిస్తున్నట్టు సమాచారం. కోవై సరళ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.  

కోవై సరళ కాంచన సిరీస్ స్టార్ట్అయినప్పటి నుంచి ఈసినిమాతో ఉన్నారు.  ఈ సినిమాని గోల్డ్ మైన్స్ నిర్మిస్తోంది. 90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. పొల్లాచ్చిలోని మాసాని అమ్మన్ ఆలయంలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలిసింది.

Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా

44
రాఘవ లారెన్స్ జోడీగా పూజా హెగ్డే

రాఘవ లారెన్స్ నటించిన సినిమాలు ఇటీవల హిట్ కాలేదు. దాంతో ఆయన ఇప్పుడు కాంచన 4 ని చేస్తున్నారు. ఈ ఏడాది అధికారం, బెంజ్, కాలభైరవ, బుల్లెట్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

Also Read: టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న అనిరుధ్, నాలుగు సినిమాల పరిస్థితి ఏంటి..?

Also Read: అజిత్ సినిమా వల్ల నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన

 

Read more Photos on
click me!

Recommended Stories