అన్న నువ్వు దగ్గరగా ఉంటే గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలనుంది.. రవితేజకి అభిమాని సంచలన లేఖ..

First Published | Aug 18, 2024, 9:03 PM IST

మాస్‌ మహారాజా రవితేజ నటించిన `మిస్టర్‌ బచ్చన్‌` విడుదలైంది. కానీ ఇది ఆడటం లేదు. దీంతో తట్టుకోలేని అభిమాని సంచలన లేఖ రాశాడు. అది వైరల్‌ అవుతుంది.
 

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియెన్స్ ని అలరించడంలో విఫలమయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ దిశగా వెళ్తుంది. రవితేజ కామెడీ, యాక్షన్‌, భాగ్యశ్రీబోర్సే అందాలు ఏమాత్రం సినిమాని కాపాడలేకపోయాయి. ఐదు రోజులు హాలీడేస్‌ ఉన్నా, వాటిని క్యాష్‌ చేసుకునే పరిస్థితిలో ఈ మూవీ లేకపోవడం అత్యంత విచారకరం. 
 

రవితేజకి వరుసగా పరాజయాలు పడుతున్నాయి. `క్రాక్‌` తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు. `ధమాఖా`ఏదో అలా ఆడింది, కానీ అది పెద్ద హిట్ కాదు. దీంతో ఆ తర్వాత వచ్చిన `ఖిలాడీ`, `రామారావు ఆన్‌ డ్యూటీ`, `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు`, `ఈగల్‌`, ఇప్పుడు `మిస్టర్‌ బచ్చన్‌` ఇలా వరుసగా అన్నీ సినిమాలు బోల్తా కొట్టాయి. ఆయన ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచాయి. మూడేళ్లలో ఆరు సినిమాలు పరాజయం చెందడటం మామూలు దెబ్బ కాదు. ఇది ఏకంగా రవితేజ మార్కెట్‌, ఇమేజ్‌పైనే దెబ్బ పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 


ఇదిలా ఉంటే రవితేజ సినిమాలు ఇలా నిరాశపరుస్తున్న నేపథ్యంలో అభిమాని స్పందించాడు. రవితేజకి తమ బాధని వ్యక్తం చేస్తూ ఓ ఓపెన్‌ లెటర్‌ రాశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. రవితేజ అన్నయ్యకి ఇది ప్రేమతో రాస్తున్న లేఖ మాత్రం కాదు, బాధని దిగమింగుకుని రాస్తున్న లేఖ అంటూ ప్రారంభించారు. అన్నయ్య నాకు చిన్నప్పట్నుంచి తెలిసింది నీ సినిమాలు తప్ప, నాకు ఇంకో ప్రపంచం తెలీదు. అందరూ ఆడుకునే వయసులో ఆడుకున్నారు, చదువుకునే వయసులో చదువుకున్నారు. ఎంజాయ్‌ చేసే వయసులో ఎంజాయ్‌ చేశారు. 
 

కానీ నేను మాత్రం మీ సినిమా, మీ ఆలోచనలు, మిమ్మల్ని తలుచుకుంటూ, నిన్ను ప్రేమిస్తూ ఉండిపోయాను. మీకు సినిమా తప్ప ఇంకోటి ఏమీ తెలీదు. మాకు నువ్వు తప్ప ఇంకోటి తెలియదు రవితేజ అన్న. 2011లో `మిరపకాయ్‌` సినిమా తర్వాత నుంచి `క్రాక్‌` సినిమాలో మాత్రమే రవితేజ కనిపించాడు. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు హిట్‌ సినిమాలైనా నీ స్థాయి సినిమాలైతే కాదు. అర్థం చేసుకుంటావని చెప్తున్నా అన్నా. నువ్వు మాకు దగ్గరగా ఉంటే నిన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి మా బాధ చెప్పుకోవాలని ఉంది అన్నా. దయజేసి మంచి కథలను ఎంపిక చేసుకో. 
 

రవితేజ అభిమానులందరూ తలెత్తుకుని తిరిగేలా హిట్లను ప్రసాదించు. అన్న దండం పెడతా అన్నా, థియేటర్నుంచి కన్నీళ్లతో బయటకు వస్తున్నాం. సినిమా సినిమాకి కన్నీళ్లు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గడం లేదు. సంతోషంగా కాలర్‌ ఎగరేసుకుని బయటకు వచ్చిన రోజులు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమాతో కూడా రాలేదు. అలాంటి రోజుల కోసం ఎదురుచూస్తున్నాం రవన్నా` అంటూ బాధతో కూడిన లేఖని రాశారు అభిమాని. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇది రవితేజ వరకు చేరుతుందా? ఆయన రియాక్ట్ అవుతాడా అనేది చూడాలి. 
 

Latest Videos

click me!