`బిగ్‌ బాస్‌` దెబ్బకి వరుస ఆఫర్లు.. హీరోగా శివాజీ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకే

బిగ్ బాస్‌ షోతో మరోసారి పాపులర్‌ అయ్యాడు నటుడు శివాజీ. దీంతో సినిమా ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆయన హీరోగా సినిమా స్టార్ట్ కావడం విశేషం. 
 

శివాజీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకుని కామెడీ సినిమాలతో అలరించారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లోనే కీలక పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మెప్పించాడు. కానీ కొంత కాలంగా ఆయన నటనకు దూరమయ్యారు. రాజకీయాల వైపు టర్న్ తీసుకోవడంతో సినిమాలను లైట్‌ తీసుకున్నారు. అవకాశాలు కూడా రాలేదు. 
 

ఈ నేపథ్యంలో మళ్లీ నటుడిగా రాణించేందుకు, సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవకాశాలు అంతగా రాలేదు. దీంతో బిగ్‌ బాస్‌ని నమ్ముకున్నాడు. గత సీజన్‌లో బిగ్‌ బాస్‌లోకి  వచ్చిన విషయం తెలిసిందే. అందరిని ప్రభావితం చేస్తూ,ఫైట్‌ చేస్తూ మొత్తానికి ఫైనల్‌ వరకు వెళ్లాడు. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు. షోలోనే హైలైట్‌గా నిలిచాడు. దీని ద్వారా తనకు కావాల్సిన మైలేజ్‌, క్రేజ్‌ హైప్‌ వచ్చింది. 


అంతేకాదు సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు రాగానే ఆయన నటించిన `90ః ఏ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ` వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్నాడు. ఇక వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. శివాజీ ఇప్పటికే `కూర్మ నాయకి` అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. `సీసా` అనే పాత సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభమయ్యింది. 

శివాజీ హీరోగా సినిమా స్టార్ట్ కావడం విశేషం. ఆదివారం ఈ మూవీని ప్రారంభించారు. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ శ్రీరామ్‌ అనే దర్శకుడు ఈ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి శివాజీ నిర్మాత కావడం విశేషం. సినిమా ఓపెనింగ్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దిల్‌ రాజు, బెక్కం వేణుగోపాల్‌ వంటి వారు పాల్గొన్నారు. 
 

ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌.. సీనియర్‌ నటి లయ కావడం విశేషం. శివాజీ, లయ కలిసి ఒకప్పుడు హిట్‌ సినిమాలు చేశారు. `మిస్సమ్మ`, `టాటా బీర్లా మధ్యలోలైలా`, `అదిరిందయ్యా చంద్రం` వంటి సినిమాలతో విజయాలు అందుకుని హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇన్నాళ్లకి మళ్లీ ఇప్పుడు పెయిర్‌గా చేయడం విశేషం. మళ్లీ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా టీమ్‌ ఆశాభావంతో ఉంది. ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టీమ్‌ తెలిపింది. 
 

Heroine Laya

లయ చాలా కాలం క్రితమే సినిమాలకు దూరమయ్యింది. `టాటా బీర్లా మధ్యలో లైలా` తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ తో బిజీ అయ్యింది. భర్త, పిల్లకే పరిమితమయ్యింది. అన్ని రకాలుగా ఇప్పుడు ఫ్రీ కావడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెడుతుంది. అందులో భాగంగా ఆమె మూవీ ఆఫర్లని అందుకుంటుంది. ప్రస్తుతం నితిన్‌ `తమ్ముడు`లో నటిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు శివాజీతో సినిమా చేస్తుంది. 
 

Latest Videos

click me!