మెగాస్టార్ చిరంజీవి జీవితం, కెరీర్ గురించి తెలియని వారు ఉండరు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆయన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఖైదీ చిత్రంతో చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు ఈ క్రమంలో చిరు.. రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్స్ తో కలసి పనిచేశారు.