పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?

First Published | Jun 29, 2024, 3:29 PM IST

రీసెంట్ గా పెళ్లి చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ప్రేమించిన ప్రియుడు.. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లాడింది. అయితే పెళ్లై వారం కూడా తిరగక ముందే సోనాక్షి నెలతప్పిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సంగతేంటంటే..? 

రీసెంట్ గా తన ప్రియుడిని పెళ్ళాడింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. నటుడు  జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో పడిన ఆమె.. స్టార్ నటుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అయితే వీరి పెళ్లై వారం కూడా అవ్వలేదు ఈలోపు ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి నిన్నా..  శుక్రవారం ముంబైలోని ఆసుపత్రి లో ఈ జంట కనిపించారు. దాంతో ఈ వార్తలకుబలం చేకూరినట్టు అయ్యింది.  

సోనాక్షి జహీర్‌తో మతాంతర వివాహం చేసుకున్నారు.  జూన్ 23న వీరి వివాహం చాలా సింపుల్ గా  జరిగింది. అయితే బిడ్డను కనడాకి వారు రెడీగా ఉన్నారంటూ.. సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సోనాక్షి  సిన్హా మరియు జహీర్‌లు తెల్లటి మెర్సిడెస్ బెంజ్ కారులో  ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుండి బయటకు వెళ్లినట్లు కనిపించింది. దీని  ప్రకారం చూస్తే నూతన వధూవరులు కారులో ఉన్నారు, అయితే ఫోటోగ్రాఫర్‌లకు మాత్రం  పోజు ఇవ్వలేదు. దాంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. 
 


అయితే బాలీవుడ్ లో ఈ రకమైన ప్రెగ్నెసీ ని ఫాలోఅయిన స్టార్లు చాలామంది ఉన్నారు. గతంలో  రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకున్న వెంటనే తన ప్రెగ్నెస్నీని అనౌన్స్ చేసింది ఆలియా భట్. అయితే పెళ్ళి కంటే ముందే వారు తొందరపడి ఉంటారని ఊహాగానాలు కూడా వినిపించాయి. కాగా ఆలియా మాధిరిగానే సోనాక్షి తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

నెటింట్లో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. "మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కు వచ్చారా..సోనాక్షి గర్భవతి అయ్యిందా..? ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పబోతున్నారా...? సోనాక్షి నిజంగా గర్భవతిగా ఉందా? అంటూ రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ బాంద్రాలో చాలాదగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు డేటింగ్ తరువాత వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే గతంలో సోనాక్షి  ఏంగేజ్మెంట్ చేసుకుందంటూ కూడా పుకార్లు వచ్చాయి. వేలికి పెద్ద డైమండ్ రింగ్ వేసుకుని.. అలంకరించుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. 
 

సోనాక్షి మొదట్లో ఈ ఫోటోను మే 8, 2022న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.  అయితే ఆ సమయంలో, చాలా మంది ఇది ఒక జ్యూవ్వెల్లరీ  ప్రమోషనల్ యాడ్ అనుకున్నారు. కాని ఆమె జహీర్ తో  రెండేళ్ల క్రితం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. తాజాగా పెళ్ళిలో కూడా ఆ ఉంగరం ఆమె చేతికి కనిపించేసరికి ఆమె ఖచ్చితంగా నిశ్చితార్దం చేసుకుందని నమ్ముతున్నా నెటిజన్లు. 

Latest Videos

click me!