`జై హనుమాన్‌`గా స్టార్‌ డైరెక్టర్‌, ఇద్దరు హీరోల మధ్యనే అసలు ఫైట్‌?.. గూస్‌బంమ్స్ అప్‌డేట్‌

First Published | Oct 29, 2024, 7:59 PM IST

`జై హనుమాన్‌` సినిమా ఫస్ట్ లుక్‌ రేపు దీపావళి సందర్భంగా రాబోతుంది. అయితే జై హనుమాన్‌గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరం. అందుకోసం ఓ స్టార్‌ డైరెక్టర్‌ని దించుతున్నారట ప్రశాంత్‌ వర్మ. 
 

ఈ ఏడాది సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన `హనుమాన్‌` అందరికి షాక్‌ ఇస్తూ సంచలన విజయాన్ని సాధించింది. టీమ్‌ కూడా ఊహించని సక్సెస్‌ని సాధించింది. సంక్రాంతికి భారీ పోటీ మధ్య చాలీచాలనీ థియేటర్లలో విడుదలైంది. నెమ్మదిగా పుంజుకుంటూ వేరే స్థాయికి వెళ్లిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ బాగా రీచ్‌ అయ్యింది. నార్త్ లో, ఓవర్సీస్‌లో అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. దీంతో యాభై కోట్లతో రూపొందిన ఈ సినిమా ఏకంగా మూడువందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. హీరోగా నటించిన తేజ సజ్జా ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయాడు. అలాగే చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సైతం స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇందులో హనుమంతుడి ఎలిమెంట్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అందులోనూ క్లైమాక్స్ లో వచ్చే హనుమంతుడి ఎంట్రీ సాంగ్‌ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఇక ఆ సినిమా టైమ్‌లోనే సీక్వెల్‌ని ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. `హనుమాన్‌` ఎండింగ్‌లోనే `జై హనుమాన్‌` ఉండబోతుందని వెల్లడించారు. దీంతో సీక్వెల్‌పై ఆసక్తి ఏర్పడింది. దీనిపై అంచనాలు పెరిగాయి. ఇది ఎప్పుడెప్పుడు రాబోతుందని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతుంది టీమ్‌. ఈ మేరకు మంగళవారం ప్రీ లుక్‌ని రిలీజ్‌ చేసింది. ఇందులో హనుమంతుడిని బ్యాక్‌ నుంచి చూపించారు. బ్యాక్‌ నుంచి చూస్తేనే హన్‌మాన్‌  ఈ రేంజ్‌లో ఉంటే అదే ఫ్రంట్‌ నుంచి చూపిస్తే, అందులో స్టార్‌ హీరోని హనుమంతుడిగా చూపిస్తే ఆ కిక్‌ మరో స్థాయిలో ఉండబోతుందని చెప్పొచ్చు. 
 


ఆ కిక్‌ కి దీపావళి స్పెషల్‌ అకేషన్‌గా ఉండబోతుంది. బుధవారం ఉదయం `జై హనుమాన్‌` సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. అంతేకాదు లీడ్‌ రోల్‌లో, అంటే జై హనుమాన్‌గా నటించే హీరో ఎవరో అనేది కూడా రివీల్‌ చేయబోతున్నట్టు తెలిపింది టీమ్‌. దీంతో జై హనుమాన్‌గా ఎవరు కనిపిస్తారనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జై హనుమాన్‌గా చాలా మంది పేరు తెరపైకి వచ్చాయి. చిరంజీవి, రానా, రామ్‌ చరణ్‌, యష్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్‌ వర్మ కూడా పలువురు హీరోలను సంప్రదించారట. అయితే వాళ్లెవరూ ఓకే చెప్పలేదు, కొందరు సెట్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ స్టార్‌ డైరెక్టర్‌ని దించుతున్నాడు ప్రశాంత్‌ వర్మ. జై హనుమాన్‌గా స్టార్‌ డైరెక్టర్‌ని ఫైనల్‌ చేశారట.  

ఆ స్టార్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు రిషబ్‌ శెట్టి. కన్నడ స్టార్‌ డైరెక్టర్‌గా, హీరోగా రాణిస్తున్నారు రిషబ్‌. ఆయన గతేడాది `కాంతార` సినిమాతో పాన్‌ ఇండియాని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ, లీడ్‌ రోల్‌లో నటించి మెప్పించాడు. కాంతారగా ఆయన అదరగొట్టారు. బాడీ లాంగ్వేజ్‌ పరంగా ఆయన హనుమంతుడి పాత్రకి కూడా బాగా సెట్‌ అవుతారు. అందుకే ప్రశాంత్‌ వర్మ.. రిషబ్‌ శెట్టిన ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యారని, రేపు దీపావళి సందర్భంగా బుధవారం హనుమంతుడిగా ఆయన ఫస్ట్ లుక్‌ రాబోతుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకిగానూ ఆయనకు పారితోషికం కూడా భారీగానే ఇవ్వబోతున్నారట. సుమారు యాభై కోట్ల వరకు రిషబ్‌ శెట్టి డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

ఇదిలా ఉంటే `హనుమాన్‌` మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. క్లైమాక్స్ లో ఆయన కూడా హనుమాన్‌గా మారిపోయారు. ఇప్పుడు `జై హనుమాన్‌`లో తేజ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరో లీక్‌ వార్త ప్రకారం.. ఇందులో అసలు ఫైట్‌ జై హనుమాన్‌ పాత్ర ధారికి, తేజ సజ్జాకి మనే ఫైట్‌ ఉంటుందని తెలుస్తుంది. అలాగే రాముడి ఎలిమెంట్లు కూడా ఉంటాయట. మరి రాముడిగా ఎవరు నటిస్తారనేది అతిపెద్ద ఇంట్రెస్టింగ్‌ విషయం. ఆ పాత్రలో కూడా పెద్ద స్టార్‌నే నటింప చేయాలని అనుకుంటున్నారట దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. మరి ఎవరు చేస్తారనేది చూడాలి. మొత్తంగా `జై హనుమాన్‌` సినిమా బడ్జెట్‌ వైజ్‌, కథ పరంగా చాలా పెద్దగా, లావిష్‌గా ఉంటుందట. పాన్‌ ఇండియా మూవీగా, భారీ స్కేల్‌లో రూపొందించబోతున్నారట ప్రశాంత్‌ వర్మ. మరి ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. 

రిషబ్‌ శెట్టి ప్రస్తుతం `కాంతార 2` సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హీరోగా నటిస్తున్నారు. అయితే `కాంతార`కి ప్రీక్వెల్‌గా ఉండబోతుందట. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్‌ బంమ్స్ తెప్పించింది. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. భారీ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు రిషబ్‌ శెట్టి. 

read more: మోక్షజ్ఞ ఎంట్రీ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్‌, ఏ పాత్రలో కనిపిస్తున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే ?

Latest Videos

click me!