ఒక మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటే.. అదే తరహా కథ, స్క్రీన్ ప్లే, ఫార్ములా ఫాలో అవుతారు మిగతా దర్శకులు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్నే ట్రెండ్ అని కూడా అనొచ్చు. ఒకసారి ఫ్యాక్షన్ కథలు, మరోసారి ప్రేమ కథలు, ఇంకొన్నాళ్ళు క్రైమ్, యాక్షన్ మూవీస్ విజయం సాధిస్తాయి.
తమిళ చిత్రం బాషా ట్రెండ్ సెట్టర్. తెలుగులో కూడా ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాషా మూవీ కథ పరిశీలిస్తే.. హీరోకి ఒక భయంకరమైన మాఫియా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ ఒక ఆశయం కోసం అజ్ఞాతంలో సాదాసీదా జీవితం గడుపుతాడు. ప్రేక్షకులకు అప్పుడప్పుడు ఇతడు సామాన్యుడు కాదని హింట్ ఇస్తూ ఉంటారు. అసలు హీరో నేపథ్యం ఏమిటనే సస్పెన్సు ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది.