ప్రభాస్ అసలు పెళ్లి చేసుకుంటాడా లేదా? అనే సందేహం అందరిలో ఉంది. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్, పెళ్లి దిశగా ఆలోచన చేస్తున్నారనిపించడం లేదు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ప్రభాస్. తాజాగా కల్కి తో వసూళ్ల వర్షం కురిపించాడు. కల్కి వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది.
ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల జాబితా పెద్దదే. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. సలార్ 2 తో పాటు దర్శకుడు హను రాఘవపూడితో ఒక చిత్రానికి ప్రభాస్ కమిట్ అయ్యాడు. కాబట్టి రానున్న మూడు నాలుగేళ్లలో ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ బిజీ. మరి పెళ్లి చేసుకునే తీరిక ఎక్కడ?