దర్శకుడిగా హేమాంబరధరరావు ను తీసుకున్నారు పద్మనాభం. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. ముందుగా తాను భయపడ్డట్టే.. సినిమా తీయ్యడానికి పద్మనాభం దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేదు. దాంతో చెన్నైలో ఉన్న తన ఇంటిని 40 వేల రూపాయలకు తాకట్టు పెట్టి సినిమా నిర్మాణం స్టార్ట్ చేశారు స్టార్ కమెడియన్.
ఈ సినిమా మధ్యలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో పూర్తి చేశారు పద్మనాభం. ఇక సినిమా రిలీజ్ అయ్యి.. అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది సినిమాకు.
అంతే కాదు ఈసినిమా కొన్ని రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది. టాలీవుడ్ లోనే ఎక్కువ మంది స్టార్స్ నటించిన సినిమాగా దేవత రికార్డ్ సాధించింది. ఈసినిమాలో రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణ రెడ్డి, అంజలీదేవి, సావుకారు జానకి, జమున వంటి స్టార్స్ ఇళ్ళలకూ వెళ్ళి పద్మనాభం ఆటోగ్రాఫ్స్ తీసుకునే సీన్ ఉంటుంది.