బిగ్‌ బాస్‌ ఛాన్స్ మిస్‌ చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా? వామ్మో వీళ్ల గట్స్ కి దెండం పెట్టాల్సిందే

Published : Aug 31, 2024, 07:57 PM ISTUpdated : Sep 01, 2024, 10:10 AM IST

బిగ్‌ బాస్‌ షోలో ఛాన్స్ రావడమనేది పెద్ద డ్రీమ్‌. కానీ చాలా మంది స్టార్‌ సెలబ్రిటీలు ఈ ఆఫర్‌ని మిస్‌ చేసుకున్నారు.  వాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.   

PREV
15
బిగ్‌ బాస్‌ ఛాన్స్ మిస్‌ చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా? వామ్మో వీళ్ల గట్స్ కి దెండం పెట్టాల్సిందే

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోలో ఆఫర్‌ రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగైనా వాళ్లని రీచ్‌ కావాలని చూస్తుంటారు. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు.

పాపులారిటీ పొందాలని చూస్తుంటారు. కానీ ఎంతో మందికి అది కలలాగే మిగిలిపోతుంది. చాలా అరుదుగానే ఇలాంటి ఆఫర్‌ వస్తుంటుంది.  అది కూడా సెలబ్రిటీలకే  ప్రయారిటీ ఇస్తుంటారు. ఎలాంటి గుర్తింపు లేని వారిని అస్సలు ఎంకరేజ్‌ చేయరు. 
 

25
Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌లోకి వస్తే క్రేజ్‌ వేరు, పాపులారిటీ వేరే. మూడు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ కావచ్చు. సెలబ్రిటీ  అయిపోవచ్చు. ఆ తర్వాత వచ్చే  గుర్తింపు, వేరే స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు.

అందుకే ఈషో కోసం చాలా మంది పోటీ పడుతుంటారు. కానీ అవకాశం దక్కేది మాత్రం వందల్లో ఒక్కరికే. కానీ విచిత్రం ఏంటంటే చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసిన వాళ్లు ఉన్నారు. తాము బిగ్‌ బాస్‌కి రాలేము అని తెగేసి చెప్పిన వాళ్లు ఉన్నారు. కొందరు అవకాశాలు కోల్పోయే వాళ్లు ఉంటారు.

కానీ బిగ్‌ బాస్‌కి నో చెప్పడమనేది ఇక్కడ బిగ్‌ మ్యాటర్‌. అయితే వారిలో ఎక్కువగా  స్టార్స్ ఉండటం విశేషం. ఎలాగూ మామూలు వ్యక్తులకు అలాంటి ఛాన్స్ ఉండదు, బాగా  గుర్తింపు ఉన్న టీవీ, సినిమా సెలబ్రిటీలు మాత్రమే  ఇలా  ఆఫర్లు  రిజెక్ట్  చేస్తారు. మరి  ఎవరెవరు ఈ ఆఫర్‌కి నో చెప్పారనేది చూస్తే. 
 

35

బిగ్‌ బాస్‌ ఆఫర్‌ని ఇటీవల ఇంద్రనీల్‌ వదులుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను ఈ షోకి సెట్‌ కాను అని ఆయన నో చెప్పారట. అంతేకాదు సీరియల్‌ నటి, సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉన్న నవ్యసామి కూడా  ఈషోని తిరస్కరించిందట.

గతేడాది తెలుగు బిగ్‌ బాస్‌లోకి ఆమె వస్తుందన్నారు. కానీ ఆమెనే రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఫోక్‌ సాంగ్స్ కి కేరాఫ్‌గా నిలిచే మంగ్లీ కూడా  బిగ్‌ బాస్‌ కి నో చెప్పిందట. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ బాంబ్‌గా నిలిచే `గుప్పెడంతా మనసు` సీరియల్‌ ఫేమ్‌ జ్యోతిరాయ్‌ కూడా  బిగ్‌ బాస్‌ ఆఫర్‌ని తిరస్కరించిందట.

మిర్యాలగూడ ఘటన ఫేమ్‌ మారుతీరావు కూతురు అమృతా రావు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ పెంచుకుంది. వీడియోలతో దుమ్ములేపుతుంది. ఆమెకి కూడా ఈ సారి ఆఫర్‌ వచ్చిందని, కానీ ఆమె కూడా నో చెప్పిందని సమాచారం. మొత్తంగా బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.

45

బిగ్‌ బాస్‌ ఛాన్స్ మిస్‌ చేసుకున్న వారిలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఉన్నారు. యాంకర్‌  వర్షిణిసౌందరాజన్‌కి కూడా పలు మార్లు ఛాన్సులు వచ్చాయి.

కానీ ఆమె రిజెక్ట్ చేసింది. కొన్నిసార్లు ఆమె ఛాన్స్ మిస్‌ చేసుకుంది. జబర్దస్త్ కమెడియన్‌ గెటప్‌ శ్రీనుకి కూడా  బిగ్‌ బాస్‌  ఆఫర్‌వచ్చిందట. కానీ తనే రిజెక్ట్ చేశాడట. మరో యాంకర్‌ ఉదయభాను కూడా  బిగ్‌ బాస్‌ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. పారితోషికం విషయంలో తేడా కొట్టి నో చెప్పిందని టాక్‌.

ఆమె ఏకంగా మూడు సార్లు రిజెక్ట్  చేయడం విశేషం. వీరితోపాటు బిగ్‌ బాస్‌ ఎనిమిదో సీజన్‌ కోసం హీరో రాజ్‌ తరుణ్‌ని కూడా  అడిగారట. కానీ ఆయన  వివాదాల్లో ఉన్న నేపథ్యంలో తిరస్కరించాడట. 

55

ఈ సారి బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. విష్ణు ప్రియా,  రీతూ చౌదరి, యాదమ్మ రాజు, బంచిక్‌ బబ్లూ, కాకినాడ పిల్ల,  బెజవాడ బేబమ్మ, సన, ఆదిత్య ఓం, దీపిక, అమర్‌ దీప్‌  భార్య వంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తారు? ఎవరికి హ్యాండిస్తారనేది చూడాలి.

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 8 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్‌ మాలో ప్రారంభం కానుంది. దీనికి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మూడో సీజన్‌ నుంచి  ఆయనే వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. దాదాపు పది సీజన్ల వరకు ఆయనతో బిగ్‌ బాస్‌ నిర్వహకులకు  కాంట్రాక్ట్ ఉందని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories