నాగార్జున అంటే అసహ్యం.. అలాంటి పొలిటీషియన్ ని బిగ్ బాస్ లోకి తీసుకువస్తే, ఇది మాత్రం పిచ్చ క్రేజీ  

First Published | Aug 31, 2024, 7:17 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8షో ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కాబోతోంది. గ్రాండ్ లాంచ్ కోసం బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

Nagarjuna

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8షో ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కాబోతోంది. గ్రాండ్ లాంచ్ కోసం బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో ఈ షోని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ముందుగా వినిపించే పేరు సిపిఐ నారాయణ. 

ఈ సినీయర్ పొలిటీషియన్ సందర్భం వచ్చిన ప్రతిసారి బిగ్ బాస్ షోపై, నిర్వాహకులపై, నాగార్జునపై విరుచుకుపడుతుంటారు. పలు సందర్భాల్లో నారాయణ బిగ్ బాస్ షోని వ్యభిచారం చేయించే షో అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 


Bigg Boss Telugu Season 8

బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలనీ, నాగార్జున పై కేసు నమోదు చేయాలని గతంలో నారాయణ ప్రయత్నించారు కూడా. కానీ అది సాధ్యపడలేదు. ఒకరికొకరికి పరిచయం లేని స్త్రీ పురుషులని 100 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉంచే సంస్కృతి ఏంటి అని నారాయణ ప్రశ్నిస్తుంటారు. 

మీకు నాగార్జున అంటే కోపమా అని ఓ ఇంటర్వ్యూలో అడగగా లేదు.. అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ అంటే ఎందుకు ఇష్టం లేదు.. కెమెరాలు ఉన్నాయిగా అని ప్రశ్నించగా.. అయితే 24 గంటలు లైవ్ చూపించాలి.. అప్పుడు అక్కడ జరిగే బండారం బయట పడుతుంది అని నారాయణ అన్నారు. ఇది అసలు మన సంస్కృతి కాదు. దీనిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని నారాయణ అన్నారు. 

ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అవుతుండడంతో కొందరు నెటిజన్లు వైల్డ్ గా ఆలోచిస్తున్నారు. నారాయణకు నాగార్జున అంటే అసహ్యం.. బిగ్ బాస్ అంటే అసహ్యం.. అలాంటి వ్యక్తిని కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువెళితే ఎలా ఉంటుంది అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు. 

నాగార్జున అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ వీరిలో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు.. ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. ఎవరిని డేట్ చేస్తావు లాంటి అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రశ్నలే అలా అడుగుతుంటే ఇక లోపల ఎంత దారుణంగా ఉంటుందో అని నారాయణ ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. 

Latest Videos

click me!