కడుపులు చేయడం నుంచి కటకటాల వరకు.. బిగ్‌ బాస్‌ షోలో షాకిచ్చే వివాదాలు.. ఇది చాలా వైల్డ్

First Published | Aug 31, 2024, 5:32 PM IST

బిగ్‌ బాస్‌ షోపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి.  కానీ జైలుకి వెళ్లడం, దాడులకు తెగబడటం, ప్రెగ్నెన్సీ కావడం ఇందులో షాకిచ్చే విషయాలు.

 బిగ్‌ బాస్‌ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్‌ మరే షోకి లేదు. ఈ షోని ఇంటిల్లిపాది చూస్తున్న నేపథ్యంలో బాగా హైప్‌ వచ్చింది. టీఆర్‌పీ రేటింగ్‌ కూడా పెరుగుతుంది. సోషల్‌ మీడియా  ప్రభావం పెరిగిన తర్వాత బిగ్‌ బాస్‌ షోని జనాలు బాగా  చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ కూడా బాగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ షో కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కుంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. షో సమయంలో, షో తర్వాత వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలుగులో బిగ్‌ బాస్‌ షో ప్రారంభం నుంచి వివాదం నడుస్తుంది. చాలా మంది ఈ షోని వ్యతిరేకిస్తున్నారు. దీన్నొక వ్యభిచార గృహాలుగా పోల్చిన ప్రముఖులు ఉన్నారు. 

బిగ్‌ బాస్‌ షోపై సీపీఐ నారాయణ తరచూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. బ్యాన్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒకరి జీవితాల్లోకి తొంగిచూస్తే క్రమంలో చెత్త పనులు చేస్తున్నారని, యువతని చెడగొడుతున్నారనే ఆరోపణలు చేశారు. సామాజాన్ని చెడగొట్టే షో అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. ప్రతి సీజన్‌ సమయంలోనూ ఆయన ఏదో రూపంలో విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయనే కాదు చాలా మంది దీన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. షో బ్యాన్‌ చేయాలనే కామెంట్లు వస్తూనే ఉన్నాయి. అయితే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, షోలో జరిగిన వివాదాలకు సంబంధించి ఓ సారి చూస్తే, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన వివాదాలు చోటు చేసుకున్నాయి. 


Pallavi Prashanth

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ వివాదం పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. విన్నర్‌ ప్రకటించిన ఈవెంట్‌ క్లోజ్‌ అయ్యాక బిగ్‌ బాస్‌ నిర్వహకులు సైలెంట్‌గా పల్లవి ప్రశాంత్‌ని స్టార్‌ హోటల్‌కి పంపించారు. కానీ పోలీసుల ఆర్డర్‌ని లెక్కచేయకుండా మళ్లీ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ కి వచ్చిన  ఫ్యాన్స్ ని కలిసి హడావుడి చేశారు. భారీగా ర్యాలీ తీశారు. దీంతో ప్రశాంత్‌ అభిమానులు దాడులకు  తెగబడ్డారు. ఇతర బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల కార్లు, బస్సులపై దాడి చేశారు. చాలా వరకు ఆస్తుల నష్టం జరిగింది.  దీంతో పల్లవి ప్రశాంత్‌ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయ్యాననే సంతోషం లేకుండా పోయింది. చాలా రోజులు బయటకు రాలేదు ప్రశాంత్‌. ఓ రకంగా ఇది ఆయన కెరీర్‌పై గట్టి దెబ్బనే పడిందని చెప్పాలి. 
 

 ఇక తెలుగులోనే మరో వివాదం.. రెండో సీజన్‌  సమయంలో విన్నర్‌ కౌశల్‌ మందాకి సంబంధించినది. నాని హోస్ట్ గా చేసిన ఆ సీజన్‌లో కౌశల్‌ విన్నర్‌ అయ్యాడు. ఆ సమయంలో కౌశల్‌కి వచ్చిన క్రేజ్‌ మామూలు కాదు, స్టార్‌ హీరోల రేంజ్‌లో ఆయన పాపులర్‌ అయ్యాడు. ఏకంగా ఆర్మీ  ఏర్పడింది. కౌశల్‌ ఆర్మీ పేరుతో ర్యాలీలు తీసి ఆయన గెలుపుకోసం పోరాడారు. ఈ ఆర్మీ నకిలీ  ఓట్లు వేశారనే  విమర్శలు,  ఆరోపణలు వచ్చాయి. మరవైపు షో అయిపోయాక కౌశల్‌ తన ఫౌండేషన్‌ స్థాపించాడు. దానికోసం భారీగా  డబ్బులు వసూలు  చేశాడని, తప్పుదారిలో జనం డబ్బులను వాడుతున్నాడనే ఆరోపణలు  వచ్చాయి.  కౌశల్‌ ఆర్మీనే ఆయనపై తిరగబడింది. దీంతో ఇది పెద్ద రచ్చ అయ్యింది. ఆయనపై దాడికి ప్రయత్నం కూడా  జరిగింది. దీంతో తన ఫౌండేషన్‌ని క్లోజ్‌ చేసుకుని కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాడు కౌశల్‌. ఆల్మోస్ట్ కెరీర్‌ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇటీవల మెరిశాడు. ఆయన  కమ్‌ బ్యాక్‌కి  సంబందించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. 

మూడు పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచింది వనితా విజయ్‌ కుమార్‌. ఆమె పెళ్లిళ్లే పెద్ద సంచలనం. గత సీజన్‌ తమిళంలో ఆమె కూతురు జోవిక బిగ్‌ బాస్‌ తమిళం 7లో పాల్గొంది. అయితే హౌజ్‌లో జోవిక, మరో కంటెస్టెంట్‌ ప్రదీప్‌ మధ్య గట్టి ఫైట్‌ జరిగింది. వాగ్వాదం జరిగింది.  ఈ విషయంలో తన కూతరు జోవికని సపోర్ట్ చేస్తూ, ప్రదీప్‌ ని విమర్శిస్తూ కామెంట్లు చేసింది. దీంతో వనితాపై ప్రదీప్‌  ఫ్యాన్స్ దాడి చేశారని సమాచారం. ఆ మధ్య వనిత సోషల్‌ మీడియాలో ముఖంపై దెబ్బలతో ఉన్న పోస్ట్ పెట్టింది. అయితే  తనపై దాడి చేసింది ప్రదీప్‌ ఫ్యాన్స్ అని  సమాచారం.  ఇది గతేడాది పెద్ద రచ్చ అయ్యింది. అలాగే అంతకు ముందు బిగ్‌ బాస్‌ షో తమిళ సాంప్రదాయానికి భిన్నంగా  ఉందని చెబుతూ,  హిందూ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. హోస్ట్ గా చేస్తున్న కమల్‌ హాసన్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

బిగ్‌ బాస్‌ షోకి సంబంధించి చాలా వివాదాలున్నప్పటికీ ఓ వివాదం మాత్రం అందరిని షాక్‌కి గురి చేస్తుంది.  అయితే హిందీ బిగ్‌ బాస్‌లో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తుంటుంది. కామెంట్లు, ఆరోపణలు హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. కానీ ప్రెగ్నెంట్‌ కావడమనేది పెద్ద షాకిచ్చే విషయమే. గత హిందీ సీజన్‌లో(బిగ్‌ బాస్‌ 17)లో ఓ హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌ కావడం సంచలనంగా మారింది. హీరోయిన్‌ అంకితా లోఖండే, విక్కీ జైన్‌ కలిసి షోకి వచ్చారు. షోలోకి వచ్చిన కొన్ని రోజులకు ఆమె కడుపులో ఇబ్బందిగా ఉందని, ప్రెగ్నెంట్‌ టెస్ట్ చేయించుకోవాలనిపిస్తుందని చెప్పింది. అంతేకాదు, మెడికల్‌  రూమ్‌కి వెళ్లి ప్రెగ్నెంట్‌ టెస్ట్ కూడా చేయించుకుందట. అయితే ఈ విషయం తెలిసి ఆమె భర్త విక్కీ షాక్‌ అయ్యాడు. రిజల్ట్ లో ప్రెగ్నెంట్‌గా తేలనట్టు సమాచారం. ఎందుకంటే  ఆమె టాప్‌ 5లో నిలిచింది. ఇలా బిగ్‌ బాస్‌లో ఏదో ఒక వివాదం రచ్చ అవుతూనే ఉంటాయి. సోషల్‌ మీడియా వచ్చాక దాని అది మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రేపటి  నుంచి తెలుగులో బిగ్‌ బాస్‌ 8వ సీజన్‌ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
 

Latest Videos

click me!