Anchor Suma: లంగా ఓణీలో 'సుమ'నోహరంగా... స్టార్ యాంకర్ గ్లామరస్ లుక్ వైరల్!

Published : Sep 01, 2023, 01:26 PM IST

లంగా ఓణీ కట్టిన సుమ అభిమానులను మైమరిపించింది. ఆమె గ్లామరస్ లుక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.   

PREV
15
Anchor Suma: లంగా ఓణీలో 'సుమ'నోహరంగా... స్టార్ యాంకర్ గ్లామరస్ లుక్ వైరల్!

ఇటీవల ఓనం పండగ ఘనంగా జరుపుకుంది సుమ. తన ఇంట్లో బుల్లితెర యాంకర్స్, సెలెబ్రెటీలకు మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది. రవి, అనసూయతో పాటు పలువురు సుమ విందుకు హాజరయ్యారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. 

 

25

ఇక రెండు దశాబ్దాలకు పైగా సుమ ప్రస్థానం కొనసాగుతుంది. యాంకరింగ్ లో ఆమె చరిత్ర సృష్టించారు. కాగా 90లలో సుమ నటిగా కెరీర్ మొదలుపెట్టారు. దాసరి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. మరో  రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. బ్రేక్ రాలేదు. దీంతో యాంకర్ అవతారం ఎత్తారు. తిరుగులేని ఆధిపత్యం సాధించారు. 

35

నెంబర్ ఆన్ యాంకర్ గా సుమ స్థానం చెక్కు చెదరలేదు. సుమ షోలో ఉన్నారంటే వినోదం పరుగులు పెడుతుంది. ఆమె టైమింగ్ పంచ్లు షోకి హైలెట్ గా నిలుస్థాయి. అందుకే దశాబ్దాలుగా ఆమె ప్రస్థానం సాగుతుంది. నాలుగైదు భాషలు సుమ అనర్గళంగా మాట్లాడుతుంది. 
 

45

కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. విరివిగా షోలే చేసే సుమ తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. 

 

55

సుమకు డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం. 

click me!

Recommended Stories