పాటలతో ఫుల్ ‘ఖుషి’నే కానీ..... (రివ్యూ)

First Published | Sep 1, 2023, 12:21 PM IST

 బ్రాహ్మణ కుటుంబం ఇంటర్ కాస్ట్ మేరేజ్ ..  కథలతో ఈ మధ్యకాలంలో నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి, అలాగే నాగశౌర్య  కృష్ణ వ్రింద విహారి చేసారు.ఈ సినిమా కోర్ పాయింట్ అలాగే అనిపిస్తుంది.  అయితే ట్రీట్మెంట్ వేరే.   

Kushi movie Review


 టక్ జగదీష్ వంటి  డిజాస్టర్ తరువాత శివ నిర్వాణ.. ‘ఖుషి’ చేసేందుకు అప్పటికే  ఫ్లాప్స్‌లో ఉన్న అటు సమంత, విజయ్ దేవరకొండల్ని ఒప్పించగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు. ఇదేం కాంబినేషన్ అనుకున్నారు. దానికి తోడు ఈ సినిమా ఆగుతూ, స్టార్ట్ అవుతూ ముందుకు వెళ్ళింది. దాంతో ఎలా ఉంటుందో ..డైరక్టర్ అనుకున్న రొమాంటిక్ కామెడీ ప్లేవర్ వస్తుందో రాదో అని అనుమాన పడ్డారు . అయితే పాటలు బయటకు వచ్చాక మొత్తం ఛేంజ్ అయ్యిపోయింది. జనం రిలీజ్ కోసం ఎదురుచూడటం మొదలెట్టారు. ఆ క్రమంలో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..అసలు ఈ చిత్రం కథేంటి..దర్శకుడు,హీరో,హీరోయిన్స్ ముగ్గురుని సక్సెస్ వైపు ఈ సినిమా తీసుకెళ్ల గలుగుతుందా?


స్టోరీ లైన్:

ఉద్యోగ నిమిత్తం కాశ్మీరు వెళ్లిన విప్లవ్ (విజయ్ దేవరకొండ)..అక్కడ  బురఖా‌లో ఉన్న బేగం (సమంత)ని చూసి  ఫిదా అయిపోతాడు. ఆమెది పాకిస్దాన్ అని, తన తమ్ముడిని వెతకటానికి ఇండియా వచ్చానని చెప్తుంది. అయితే పాకిస్దాన్ అన్నా మనవాడు వెనకపడటం మానేయడు. మరింత పట్టుదలతో ఆమెను ప్రేమలో పడేయటానికి ప్రయత్నిస్తాడు..సక్సెస్ అవుతాడు. అయితే అక్కడో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆమె బేగం కాదని బ్రాహ్మిణ పిల్ల అని పేరు ఆరాధ్య అని, వాళ్లది అసలు కాకినాడ అని అర్దమవుతుంది. దానిదేముంది అంటారా.. ఇక్కడే మరో విషయం ఆమె  తండ్రి  చందరంగం శ్రీనివాసరావు (మురళీశర్మ)గారు కాకినాడలో పెద్ద ప్రవచన కర్త(ఎవరన్నా గుర్తు వస్తున్నారా). అదీ ఓకే అనుకుంటే అసలు ట్విస్ట్ విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) పెద్ద నాస్తికవాది. నాస్తిక సంఘం ప్రెసిడెంట్.  దాంతో ఇటు సంప్రదాయ కుటుంబం,అటు నాస్తిక కుటుంబం నుంచి వచ్చి ప్రేమలో పడ్డ జంట తమ పెద్దలను ఒప్పించటం కష్టమే. అయినా సాహసిస్తారు.


ఈ క్రమంలో జాతకాలు చూసిన ఆరాధ్య తండ్రి ...ఈ జంట పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండలేరని.. వారికి గండం ఉందని తద్వారా కాపురంలో సమస్యలు వస్తాయని,పిల్లలు పుట్టరని హెచ్చరిస్తాడు. అంతేకాదు పిల్లలు పుట్టాలంటే హోమం చేయించుకోవాలని చెప్తారు. అవన్నీ నమ్మక ఈ జంట కాపురం మొదలెడతారు. అప్పుడు ఏమైంది...నిజంగానే సంతాన సమస్య వాళ్ల కుటుంబంలో వచ్చిందా.. వాళ్ల కాపురం సమస్యలు లేకుండా సజావుగా సాగిందా... పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, ట్రెడిషన్స్ ఉన్న ఆ రెండు కుటుంబాలు ఒకటయ్యాయా...చివరకు ఏమైంది... డైరక్టర్ ఈ కథతో ఏమి చెప్దామనుకున్నాడు అన్నదే మిగిలిన కథ.
 

ఎనాలసిస్ 

వాస్తవానికి ఈ చిత్రం కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. అయితే ఆల్రెడీ తెలిసి థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని రెండు గంటలు పైగా కూర్చోబెట్టడమే పెద్ద టాస్క్. అలా చేయాలంటే డైరక్టర్ దగ్గరుండే ఏకైక ఆయుధం స్క్రిప్టు. శివనిర్వాణ తనకుంటూ ఓ స్కూల్ ఆఫ్ థాట్ స్క్రీన్ ప్లే ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు.  ప్రేమించిన అమ్మాయికి పెళ్లైపోతే ఆమె కోసం  హీరో పడే బాధ,  తపనని‘నిన్నుకోరి’లో చూపించాడు. ప్రేమించిన అమ్మాయికి దూరమై.. ఇష్టం లేని పెళ్లి చేసుకుని అటు భార్య ప్రేమను పొందలేక.. ఇటు ప్రేయసి జ్ఞాపకాల్లో నుంచి బయటకు రాలేని  మధనాన్ని ‘మజిలీ’లో చూపించారు. ఈ రెండూ లవ్ ఫెయిల్యూర్ కథలకు విరుద్దంగా ‘ఖుషీ’డిజైన్ చేసాడు. ప్రేమ కోసం పెద్దల్ని కాదని  పెళ్లి పీటలు ఎక్కిన కథ. ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలు చుట్టూ కథ అల్లాడు.
 


ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తూ... ఫస్టాఫ్ అంతా కాశ్మీర్ అందాలను అడ్డం పెట్టి ఇద్దరి మధ్యా లవ్ సీన్స్ నడిపాడు. అయితే ఇంకా ఈ రోజుల్లో(పాత సినిమాలను గుర్తు చేస్తూ) కూడా హీరోయిన్ ని ఇబ్బంది పెడుతూ హీరో ...వెంటబడటం అదీ ఊరుకానీ ఊళ్లో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.  సెకండాఫ్ లో ఇద్దరు అభిప్రాయభేధాలతో విడిపోతారేమో అని సిట్యువేషన్ క్రియేట్ చేసాడు. అయితే బ్రాహ్మణ కుటుంబం ఇంటర్ కాస్ట్ మేరేజ్ ..  కథలతో ఈ మధ్యకాలంలో నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి, అలాగే నాగశౌర్య  కృష్ణ వ్రింద విహారి చేసారు.ఈ సినిమా కోర్ పాయింట్ అలాగే అనిపిస్తుంది.  అయితే ట్రీట్మెంట్ వేరే.   
 


ఇలాంటి కథలకు అవసరమైన విట్టీ రైమింగ్ డైలాగులు  బాగా పడ్డాయి. మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట విడిపోతారేమో అనే సందేహం అయితే క్రియేట్ చేయగలిగాడు. అదే చివరిదాకా నిలబెట్టింది.  కథ పరంగా కూడా చాలా హైవుండే మూమెంట్ ని బాగానే డిజైన్ చేసాడు కానీ లెంగ్త్ ఎక్కవ అవటంతో అవి పెద్దగా రిజిస్టర్ కావు. ఇంట్రవెల్ కు ముందు వచ్చే సీన్స్ కథను మలుపు తిప్పుతాయి.  అదే అసలు కథ.  ఆ సీక్వెన్స్ ని మాత్రం చాలా బాగా తీశాడు.ఏదేమైనా ఫస్టాఫ్ తో పోల్చుకుంటే రెండో సగంలో అసలు కథ నడిపినా..ఫస్టాఫే ఇంట్రస్ట్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు.  


సాంకేతికంగా ..

టెక్నికల్ యాస్పెక్ట్ లో చూస్తే డైరక్టర్ శివ నిర్వాణ...పాత స్టోరీ లైన్ ఈ కాలానికి తగినట్లు మార్చి చెప్పారని అర్దమవుతుంది. దాంతో కొంత ప్రెడిక్టబులిటి వచ్చేసింది. అయితే రొమాంటిక్ కామెడీ కాబట్టి నడిచిపోయింది. టెక్నికల్ గా సినిమా బాగా సౌండ్ గా  వుండేలా చూసుకున్నారు.   జి మురళి కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనం కూడా కాశ్మీర్ లో తిరుగుతున్నామనే ఫీలింగ్ కలిగించేలా ప్రతి ఫ్రేం ని చాలా శ్రద్ధతో తీర్చిదిద్దిన పనితీరు కనిపిస్తుంది. ఇక మొదటి నుంచి చెప్పుకున్నట్లుగానే Hesham Abdul Wahab సంగీతానికి ఫుల్ మార్కులు పడిపోతాయి.  పాటలు చూడటానికి కూడా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ రొమాంటిక్ ఫీల్ ని కలగచేయటంలో చాలా వరకూ సక్సెస్ అయ్యింది.  ఎడిటింగ్ వైపు చూస్తే ట్రిమ్ చేసి కాస్త లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. రైటింగ్ డీసెంట్ గా ఉంది. కానీ మ్యాజిక్ జరగలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మామూలుగా లేవు.


నటీనటల ఫెరఫార్మెన్స్ ..

విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే బోయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ ని కంటిన్యూ చేసారు.  ఫస్ట్ సీన్ నుంచి చివరి సన్నివేశం వరకూ ఆ  పాత్రను వదిలి బయటికి రాలేదు.అయితే అంతకు ముందు అలాంటి పాత్ర చేయటం కొత్త కాదు కాబట్టి మామూలుగా అనిపించింది. సమంత కూడా విజయ్ తో పోటీ పడింది.  వెన్నెల కిషోర్ మాత్రం ఫస్టాఫ్ లో ఎప్పటిలాగే బాగా చేసాడు అనిపించుకున్నారు. రాహుల్ రామకృష్ణ..గీతా గోవిందం పాత్రకు కంటిన్యూయేషన్ అనిపించింది. మురళి శర్మ, సచిన్ కేడేక్కర్, జయరామ్, రోహిణి వీళ్లంతా తలో ప్రక్కా డ్రామాని మోసారు.  శ్రీకాంత్ అయ్యింగార్ జస్ట్ ఓకే.


ప్లస్ లు
కాశ్మీర్ లో అద్బుతమైన  లొకేషన్స్ 
విజయ్ దేవరకొండ సహజమైన నటన
సాంగ్స్ ,పిక్చరైజేషన్
ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అవటం


మైనస్ లు 

స్లో నేరేషన్
లెంగ్త్ బాగా ఎక్కువ ఉండటం
హై మూమెంట్స్ హైలెట్ కాకపోవటం
బాగా తెలిసిన కథ

Final Thoughts

Well, సినిమా బాగుంది కానీ కొత్తగా అనిపించదు.. స్టోరీ టెల్లింగ్ లో కానీ ,సీన్ క్రియేషన్ కానీ అద్బుతం అనిపించదు కానీ అలా నడిచిపోతుంది...కాస్త ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గిస్తే  బాగుండేది. ఏదైమైనా  it's a watchable entertainer with its share of high points.
 

RATING: 3/5
 ---సూర్య ప్రకాష్ జోశ్యుల

Latest Videos

click me!