నీతోనే డాన్స్ షోకి శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. తన యాంకరింగ్ స్కిల్స్ తో గ్లామర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి డిజైనర్ వేర్లో మెస్మరైజ్ చేసింది. జడవేసి, పూలు పెట్టి పల్లెటూరి భామ పోజులిచ్చింది.
210
Anchor Sreemukhi
ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది . ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. కొత్తగా నీతోనే డాన్స్ అనే రియాలిటీ షో స్టార్ట్ చేసింది. ఇది సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో.
310
Anchor Sreemukhi
నీతోనే డాన్స్ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. బీబీ జోడి ముగిసిన వెంటనే మరో షోని శ్రీముఖి పట్టేసింది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.
410
Anchor Sreemukhi
మరోవైపు నటిగా శ్రీముఖి బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన భోళా శంకర్ మూవీలో శ్రీముఖి క్రేజీ రోల్ చేసింది. చిరంజీవితో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.
510
Anchor Sreemukhi
పవన్ కళ్యాణ్- భూమికల ఖుషి చిత్రంలోని నడుము చూసే సన్నివేశాన్ని చిరంజీవి, శ్రీముఖి స్పూఫ్ చేశారు. భోళా శంకర్ పరాజయం కావడంతో శ్రీముఖితో సీన్స్ ట్రోల్స్ కి గురయ్యాయి. చిరంజీవి స్థాయికి తగిన సన్నివేశాలు కాదని నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు.
610
Anchor Sreemukhi
భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో శ్రీముఖికి ఫేమ్ దక్కకపోగా ఉన్న ఇమేజ్ పోయింది. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. హీరోయిన్ కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు.
710
Anchor Sreemukhi
మొదట్లో శ్రీముఖి హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. వేచి చూసి విసిగిపోయిన శ్రీముఖి యాంకర్ గా మారారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. మెల్లగా బుల్లితెర స్టార్ గా ఎదిగింది.
810
Anchor Sreemukhi
అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు.
910
Anchor Sreemukhi
రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.
1010
Anchor Sreemukhi
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.