మెగాస్టార్ చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..? వైరల్ న్యూస్ లో నిజమెంత..?

Published : Aug 19, 2023, 01:49 PM IST

ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది సాయి పల్లవి. ఇక సినిమాలు మానేస్తుంది అనుకున్నారంతా. రకరకాల గాసిప్స్ కూడా వచ్చాయి. సినిమాలు వదిలేసి డాక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. ఈక్రమంలో అవన్నీ గాసిప్స్ అని తేలిపోయాయి.  సాయి పల్లవి మంచి సినిమా కోసం ఎదురు చూస్తోంది. 

PREV
16
మెగాస్టార్ చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..? వైరల్ న్యూస్ లో నిజమెంత..?

వచ్చిన ప్రతీ సినిమా చేసేయడం సాయి పల్లవికి ఇష్టం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుది. హీరోయిన్ క్యారక్టర్ కు పర్ఫామెన్స్ స్కోప్ ఉంటేనే సినిమాచేస్తుంది సాయిపల్లవి. అంతే కాని హీరో డామినేటెడ్ మూవీను ను అస్సలు ఒప్పుకోదు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఏకంగా మెగాస్టార్ సినిమానే రిజక్ట్ చేసిందట. 

26
sai pallavi keerthi suresh

ఇక అసలు విషయంలోకి వస్తే..సాయి పల్లవికి సినిమాల సెలక్షన్ లో గొప్ప జడ్జిమెంట్ ఉందని లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన బోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ పోషించిన క్యారెక్టర్ లో మొదట సాయి పల్లవి చేత చేయించాలని చాలా ప్రయత్నాలు చేశారట మూవీ టీమ్. కాని సాయి పల్లవి అందుకు అంగీకరించలేదు. ఆ పాత్ర చేయనని చెప్పేసిందట. 

36

కారణాలు ఏమైనప్పటికీ సాయి పల్లవి చిరంజీవి చెల్లెలుగా నటించడానికి ఒప్పుకోలేదు. ఈ విషయాన్నే సాయి పల్లవి అభిమానులు ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.చిరంజీవి లాంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ వస్తే ఎవరైనా సరే ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ సరిగా లేదని ఆ సినిమా ఒప్పుకోలేదని ఆమె అభిమానులు అంటున్నారు. 

46

గతంలో కూడా ఇలానే సరిలేరు నీకెవ్వరు సినిమా కథతో అనిల్ రావిపూడి వెళ్తే.. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్ స్కోప్ లేదంటూ.. రిజక్ట్ చేసిందని టాక్.  సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన చేయాలని అమ్మాయిలు కలలు కంటారు. హీరోయిన్లు క్యూలో ఉంటారు. తన కెరీర్ కు ప్లస్అవుతుందని కూడా ఆలోచించకుండా.. రిజక్ట్ చేసిందట. సాయి పల్లవి సినిమాకు... తను చేసే పాత్రకు అంత విలువ.. గౌరవం ఇస్తుంది. చూసే జనాలు కూడా అలానే ఉండాలని కోరకుంటుంది. 

56

అంతే కాదు.. సాయి పల్లవికి సినిమాల సంఖ్య పెంచుకోవడం ఇంపార్టెంట్ కాదు.. అలా అని  డబ్బులు కోసమో సాయి పల్లవి సినిమా ఒప్పుకోదు.. ఆమె అభిమానులు గర్వంగా చెప్పుకునేలా మంచి సినిమాలు చేసి.. ఎప్పటికీ తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలి.. తన పాత్రకు కాస్తయినా యాక్టింగ్ స్కోప్ లేకుంటే నటించి ఉపయోగం ఏంటీ అనుకుంటుంది బ్యూటీ. 
 

66

 అందుకే సంవత్సరం నుంచి ఎటువంటి సినిమా కూడా సాయి పల్లవి నుంచి రాలేదని గుర్తు చేస్తున్నారు. సాయి పల్లవి గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన డియర్ కామ్రేడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని కూడా ఆమె అభిమానులు ప్రస్తావిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం ఒక కొత్త మూవీ లో నటిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories