ఫారేన్ వీధుల్లో పాయల్ రాజ్ పుత్ రచ్చ.. ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ స్టిల్స్

First Published | Aug 19, 2023, 2:04 PM IST

‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా లండన్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడి నుంచి అదిరిపోయే ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)    తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ మతులు పోగొట్టింది.
 

తొలిచిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది.  పాయల్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ఆడియెన్స్ తో పాటు దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. దీంతో మరిన్ని చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. 
 


తొలుత సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన పాయల్.. తన నటన, అందంతో నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఫస్ట్ పంజాబీ మూవీతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత హిందీలోనూ ఓ మూవీ చేసి తెలుగులోకి RX100తో ఎంట్రీ ఇచ్చింది.
 

ఇక కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేకపోవడం విశేషం. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మరో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అజయ్ భూపతి - పాయల్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మంగళవారం’పైనే ఆశలు పెట్టుకుంది.
 

ఇటీవల ఆ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలై ఆకట్టుకున్నాయి.  అలాగే రెండ్రోజుల కింద ‘గణగణ మోగాలిరా’ ఫస్ట్ సింగిల్ కూడా విడుదలైంది. ఇలా ఎప్పటికప్పుడు మూవీ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ పాయల్ రచ్చ చేస్తోంది. 

ప్రస్తుతం లండన్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. తన కూల్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!