రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు.